ETV Bharat / city

Liquor Rates Reduced in AP: మందుబాబులకు శుభవార్త.. మద్యం పన్ను రేట్లలో మార్పులు

author img

By

Published : Dec 19, 2021, 9:57 AM IST

Liquor Rates Reduced in AP: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. తద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది.

Liquor Rates Reduced in AP: మందుబాబులకు శుభవార్త.. మద్యం పన్ను రేట్లలో మార్పులు
Liquor Rates Reduced in AP: మందుబాబులకు శుభవార్త.. మద్యం పన్ను రేట్లలో మార్పులు

Liquor rates reduced in AP: మద్యం పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యాట్, ఎక్సైజ్‌ డ్యూటీ స్పెషల్‌ మార్జిన్‌లో హేతుబద్ధత తీసుకువచ్చింది. పన్నుల హేతుబద్ధత ద్వారా మద్యం ధరలు తగ్గుతాయని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు.

"ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరైటీలపై 5-12 శాతం ధర తగ్గే అవకాశం ఉంది. ఇతర అన్ని కేటగిరీలపై 20 శాతం వరకు ధరలు తగ్గుతాయి. అక్రమ మద్యం, నాటుసారా తయారీ అరికట్టేందుకే ధరల తగ్గింపు. వచ్చే వారం నుంచి ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం వినియోగం తగ్గింది. అక్రమ రవాణా అరికట్టేందుకే మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం" - రజత్ భార్గవ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఏపీ సర్కారు తెలిపింది.

ఇదీ చూడండి: Fake Certificates: నకిలీ సర్టిఫికేటుగాళ్లు అరెస్ట్.. కంప్యూటర్లు, స్టాంపులు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.