ETV Bharat / city

2021లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యం కేసులు 7297

author img

By

Published : Dec 31, 2021, 12:20 PM IST

Illegal Liquor Cases in Telangana 2021: అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలపై రాష్ట్ర అబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. 34 జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో దాడులు చేసి.. 2021లో జనవరి నుంచి డిసెంబర్​ వరకు ఎక్సైజ్ అధికారులు 7297 కేసులు నమోదు చేశారు. వీటిలో 6546 మందిపై బైండోవర్ కేసు నమోదు చేసి వారిలో 4794 మందిని అరెస్టు చేశారు.

Illegal Liquor Cases in Telangana
Illegal Liquor Cases in Telangana

Illegal Liquor Cases in Telangana 2021: తెలంగాణ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలపై అబ్కారీ శాఖ కొరడా ఝుళిపించింది. జనవరి నుంచి డిసెంబరు చివర వరకు ఏడువేలకుపైగా కేసులు నమోదు చేసిన ఎక్సైజ్‌ శాఖ దాదాపు ఐదువేల మందిని అరెస్టు చేయడంతో పాటు ఆరున్నరవేల మందిపై బైండోవర్‌ కేసులు పెట్టింది. 28 వేల లీటర్లకు పైగా అక్రమ మద్యం సీజ్‌ చేయడంతో పాటు ఆరు లక్షలకు పైగా లీటర్లు బెల్లం ఊట ధ్వంసం చేయడంతో పాటు 740కిపైగా వాహనాలను సీజ్‌ చేశారు.

అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా..

Telangana Illegal Liquor Cases 2021 : తెలంగాణ రాష్ట్రంలో అక్రమ మద్యం, నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ అమ్మకాలపై అబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించి అక్రమార్కులపై కొరడా ఝుళిపించాయి. గుడుంబా, నాన్‌డ్యూటీ పెయిడ్‌ లెక్కర్‌లపై గట్టి నిఘా పెట్టడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.

ఆ జిల్లాల్లో అధిక కేసులు..

Illegal Liquor Cases: 2021 జనవరి నుంచి డిసెంబరు చివర వరకు జిల్లాల వారీగా చూస్తే.. మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌, భూపాల్‌పల్లి జయశంకర్‌ జిల్లాల పరిధిలో ఒక్కో జిల్లాలో ఆరు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం జిల్లాల పరిధిలో నాలుగున్నర వందలకు పైగా మంది అరెస్టు కాగా మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల పరిధిలో మూడు వందలకుపైగా మందిని గుడుంబా తయారీ, అక్రమ మద్యం సరఫరా కేసుల్లో ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.

34 జిల్లాలు.. 7297 కేసులు..

Illegal Liquor Shops in Telangana: మొత్తం 34 జిల్లాల పరిధిలో గుడుంబా తయారీ, నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ సరఫరాదారులపై 7,297 కేసులు నమోదు చేయడంతో పాటు 6వేల 546 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టారు. ఈ కేసుల్లో 4,794 మందిని అరెస్టు చేసినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా 28,739 లీటర్లు గుడుంబా, నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ స్వాధీనం చేసుకోవడంతో పాటు 6లక్షల 5వేల 101 లీటర్లు గుడుంబా తయారీకి సిద్దంగా ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. 741 వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు అపరాధ రుసుం కింద రూ.52.53లక్షల మొత్తం నగదు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరిపై పీడీ చట్టాన్ని ప్రయోగించిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు.. ఎంఆర్పీ ధరలపై అదనంగా మద్యాన్ని విక్రయించడంపై 48 కేసులు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.