తెలంగాణ

telangana

Nano Mask: వైరస్‌ను సంహరించేందుకు కొత్త అస్త్రం.. "నానో మాస్క్‌"

By

Published : Feb 5, 2022, 10:41 AM IST

Nano Mask: కరోనా వైరస్​ నుంచి రక్షించుకునేందుకు మాస్క్​ ప్రధాన అస్త్రంగా మారిన నేపథ్యంలో.. మార్కెట్లోలో రకరకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సరికొత్త నానో మాస్కులను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

New Nano Mask for protecting from corona virus
New Nano Mask for protecting from corona virus

కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే సరికొత్త నానో మాస్క్​

Nano Mask: కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే సరికొత్త నానో మాస్కులను హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూమెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి స్వీయ క్రిమిసంహారకంగా పనిచేయడంతో పాటు భూమిలో సులువుగా కలిసిపోయే బయో డిగ్రేడబుల్‌ నూలు (కాటన్‌) మాస్కులు. రాగి ఆధారిత నానో పార్టికల్‌ కోటెడ్‌ ఫ్యాబ్రిక్‌తో యాంటీ వైరల్‌ మాస్కును శాస్త్రవేత్తలు డాక్టర్‌ టి.నర్సింగరావు, డాక్టర్‌ కల్యాణ్‌ హెబ్రమ్‌, డాక్టర్‌ బి.వి.శారద బృందం తయారు చేశారు.

సీసీఎంబీలో ఈ మాస్కులను పరీక్షించగా.. 99.9 శాతం వైరస్‌, బ్యాక్టీరియా నుంచి స్వీయ క్రిమిసంహారకంగా పనిచేశాయని ఏఆర్‌సీఐ ఇంఛార్జి డైరెక్టర్‌ టి.నర్సింగరావు తెలిపారు. "రాగిలో బ్యాక్టీరియాను చంపే గుణముంది. అందుకే రాగి ఆధారిత నానో కాంపోజిట్‌ పార్టికల్‌ కోటెడ్‌తో మాస్కులను తయారు చేశాం. బెంగళూరుకు చెందిన రెసిల్‌ కంపెనీ నూలు వస్త్రంపై కాపర్‌ నానో కాంపోజిట్‌ పార్టికల్స్‌ను అద్దుతోంది. కంపెనీలు ముందుకొస్తే పెద్దఎత్తున తయారీకి అప్పగిస్తాం" అని నర్సింగరావు తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details