తెలంగాణ

telangana

CM KCR : 'తెలంగాణ ప్రగతి ప్రస్థానం అవిఘ్నంగా సాగాలి'

By

Published : Sep 10, 2021, 11:26 AM IST

తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఎలాంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగాలని ఆ విఘ్నేశ్వరునికి మొక్కుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వినాయక చవితి సందర్భంగా.. సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

విఘ్నాలు తొలగించే దైవంగా పూజలందుకునే వినాయకునికి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించాలని, తెలంగాణ ప్రగతి ప్రస్థానం అవిఘ్నంగా సాగేలా చూడాలని ఆ పార్వతీ తనయుడికి ప్రార్థించినట్లు చెప్పారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు.. వారు కోరుకున్న గమ్యం వైపు ఎలాంటి అడ్డంకులు లేకుండా పయనించేలా చూడాలని ఆ విఘ్నేశ్వరుణ్ని ప్రార్థించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి, అది తీసుకొచ్చిన కష్టాల నుంచి ప్రజలను కాపాడాలని ఆ లంబోదరునికి వేడుకున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details