తెలంగాణ

telangana

Bhatti Comments on Assembly Sessions : 'శాసనసభ సాక్షిగా కాంగ్రెస్​ నేతలను అవమానించారు'

By

Published : Mar 15, 2022, 12:28 PM IST

Bhatti Comments on Assembly Sessions : శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ నేతలను అవమానించారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. పదేపదే తమ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని కాంట్రాక్టర్ అంటూ వెక్కిరించినట్లుగా మాట్లాడటం అధికార పార్టీ నేతలకు సమంజసం కాదని హితవు పలికారు.

Bhatti Comments on Assembly Sessions
Bhatti Comments on Assembly Sessions

Bhatti Comments on Assembly Sessions : అధికార పార్టీ నేతలు.. పదే పదే తమ నాయకులను అవమానిస్తున్నారని సీఎల్పీ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలోనూ తమను కించపరిచే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. సభలో సభ్యులను గౌరవంగా సంబోధించాలి గానీ.. వారు చేసే వృత్తులను బట్టి పిలవకూడదని సూచించారు.

Bhatti on Assembly Sessions 2022 : "ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పదేపదే కాంట్రాక్టర్ అనడం సరికాదు. శాసనసభ్యులు చాలా మందికి వృత్తులు ఉంటాయి. అలాగని వారి వృత్తి గురించి సభలో ఎందుకు మాట్లాడతారు. ఎవరైనా గౌరవసభ్యులు అనే సంబోధించాల్సి ఉంటుంది. స్పీకర్ పోచారం కూడా తాను కాంట్రాక్టర్‌నే అని చెప్పారు. అలాగని సభాపతిని కాంట్రాక్టర్ అని పిలవలేం కదా. ఎమ్మెల్యేలను కూడా అంతే. "

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Telangana Assembly Sessions 2022 : సాగునీటి ప్రాజెక్టు అసలు లెక్కలు, అవినీతి గురించి మాట్లాడకుండా తెరాస మంత్రులు సభను పక్కదారి పట్టించారని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు? దానికి ఎంత విద్యుత్ వినియోగించారు? ఆ విద్యుత్‌కు ఎంత ఖర్చయింది వంటి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సభలో మంత్రులు, తెరాస నేతలు.. కాంగ్రెస్‌ పార్టీని కించపరచకుండా గౌరవంగా మాట్లాడాలని కోరారు. పదేపదే అవమానించడం వల్ల అధికారపార్టీ పరువే పోతుందని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details