తెలంగాణ

telangana

98 ఏళ్ల వయసులోనూ వ్యవసాయం చేస్తున్న బామ్మ

By

Published : May 10, 2022, 11:40 AM IST

98 Years Old Woman is Farming
98 Years Old Woman is Farming

98 Years Old Woman is Farming : ప్రస్తుతం 40 ఏళ్లు రాగానే కాళ్లూచేతులు టాటా చెబుతున్నాయి. నడుము సెండాఫ్ ఇచ్చేస్తోంది. ఇక 60 ఏళ్ల వాళ్లు బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ఉంటున్నారు. ఆరు పదుల వయసులోనూ కాస్త ఆరోగ్యంగా ఉంటే.. కాలు కింద పెట్టకుండా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. వృద్ధాప్యాన్ని సాఫీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కానీ వయసు సెంచరీకి చేరువైన ఓ వృద్ధురాలు మాత్రం కాటికి కాలు చాపిన వయసూలోనూ చురుగ్గా వ్యవసాయం చేస్తోంది. అదీ సేంద్రీయ పద్ధతిలో.. ఇంతకీ ఎవరా వృద్ధురాలు.. ఆమె స్టోరీ ఏంటో చదివేయండి..

98 Years Old Woman is Farming : 60 సంవత్సరాలు దాటితే చాలు.. వయసు ఉడిగిపోయిందనుకుంటారు.. ఎలా విశ్రాంతి తీసుకోవాలా అని ఆలోచిస్తుంటారు చాలామంది. కానీ, 98 ఏళ్ల మునిరత్నమ్మ ఈ వయసులోనూ చురుగ్గా కనిపిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వరి, జొన్న, రాగులు, మామిడి, జామ వంటి పంటలు పండిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన మునిరత్నమ్మ 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌లో 17 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమిలో కూలీల సాయంతో.. వారితో పోటీ పడుతూ పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఆమె తెల్లవారుజామునే లేచి.. పొలం బాట పడుతున్నారు. సేంద్రియ పద్ధతిలో వరి, జొన్న, రాగులు, మామిడి, జామ వంటి పంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఏదైనా చేయాలనుకుంటే వయసు అడ్డు కాదని.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని నిరూపిస్తున్నారు.

98 ఏళ్ల వయసులో ఈ వృద్ధరాలు పడుతున్న కష్టాన్ని కేంద్ర సర్కార్ గుర్తించింది. ఆమె కృషి ఎందరికో ఆదర్శం కావాలని ఆమెను సత్కరించింది. 2014లో అప్పటి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడి చేతుల మీదుగా మునిరత్నమ్మ శ్రమధాత్రి అవార్డును స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details