తెలంగాణ

telangana

బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఫీజు​.. ట్విట్టర్​ టాప్ మేనేజ్​మెంట్ నుంచి మరొకరు ఔట్

By

Published : Nov 2, 2022, 10:29 AM IST

Updated : Nov 2, 2022, 10:41 AM IST

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉండేవారు కోరుకున్న అత్యున్నత స్థానం బ్లూటిక్​ సొంతం చేసుకోవడం. అయితే ఈ బ్లూ టిక్ కావాలంటే ఒక్కో యాప్​కు ఒక్కో రూల్స్​ ఉంటాయి. వాటికి అనుగుణంగా నడుచుకుంటే కొంత రుసుము చెల్లించి మనం కూడా బ్లూ టిక్​ పొందవచ్చుని ఎలన్​ మస్క్​ ప్రకటించారు.

Blue for USD 8 per month: Chief Twit Musk
Blue for USD 8 per month: Chief Twit Musk

ట్విట్టర్​కు కొత్త అధినేతగా మారిన ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్​లో వెరిఫైడ్ అకౌంట్‌గా కొనసాగాలంటే భవిష్యత్తులో నెలకు 8 సుమారు 661 రూపాయలు, అంటే ఏడాదికి దాదాపు 8వేల రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలా పేమెంట్ చేసిన అకౌంట్లు మాత్రమే బ్లూ టిక్‌ అకౌంట్లుగా కొనసాగుతాయని తేల్చి చెప్పారు. స్కామ్‌ల నుంచి ట్విట్టర్‌ను కాపాడాలంటే ఇదే సరైన మార్గమని మస్క్‌ స్పష్టం చేశారు.

ఖాతాదారుడి పేరు పక్కన బ్లూ కలర్ టిక్‌ మార్క్‌ ప్రస్తుతం ఉచితంగా లభిస్తుండగా.. ఇకపై నెలకు 661 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రాబోయే కాలంలో ట్విట్టర్​ను ప్రకటనల మీద ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని ప్రకటించిన ఎలాన్ మస్క్ అందులో భాగంగానే సమూల సంస్కరణల వైపు అడుగులు వేస్తున్నానని అన్నారు.

బ్లూటిక్‌కు ఫీజు వసూలు ద్వారా పెయిడ్ యూజర్లకు రిప్లై, సెర్చ్‌లలో ప్రాధాన్యం పెరుగుతుందని.. ప్రకటనలు సగానికి తగ్గిపోతాయని మస్క్ చెబుతున్నారు. నెలకు 8 డాలర్ల వసూలు అనేది ప్రజలకు పవర్‌ లాంటిదని మస్క్‌ ట్విట్టర్​లో కామెంట్‌ చేశారు. బ్లూ టిక్ పొందడానికి గతంలో ఆన్‌లైన్ అప్లికేషన్ నింపాల్సి వచ్చేది. వీటిలో ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు పెట్టుకున్న దరఖాస్తులు మాత్రమే బ్లూ టిక్ పొందేవి.

గతంలో ఉన్న బ్లూ టిక్ వెరిఫికేషన్ విధానం ధనిక, పేద భావజాలానికి సంబంధించిన విధానమని, దానిని తాము సమూలంగా మార్చేస్తామని మస్క్ వ్యాఖ్యానించారు. 2009లో ట్విటర్ ఈ బ్లూ టిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నమ్మకమైన అకౌంట్లను నిర్వహించడం లేదంటూ కేసు ఎదుర్కొన్న తర్వాత అప్పట్లో ట్విటర్ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా లాభాల్లో లేని ట్విట్టర్​ను మళ్లీ గాడిన పెట్టాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ట్విట్టర్​ను సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని ఇందులో ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయని తెలిపాయి.

ట్విట్టర్​లో అనేక ఫీచర్లనూ మస్క్ మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు, ట్విట్టర్​ను న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి డీలిస్ట్ చేసే ప్రక్రియను కూడా ఆ సంస్థ ప్రారంభించింది.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్విట్టర్​ ఒక ప్రైవేట్ కంపెనీగా మారుతుంది. ఆ తర్వాత నుంచి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా ఉండదు. ఇటు పరాగ్ అగర్వాల్‌ను సీఈఓగా తొలగించిన తర్వాత ట్విటర్ సీఈఓ ఎవరనే చర్చ మొదలైంది. అయితే, ఎలాన్ మస్కే కొత్త సీఈఓ, డైరెక్టర్ అని ట్విట్టర్ స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేసింది. అయితే ట్విట్టర్​ నుంచి మరో కీలకమైన వ్యక్తి అయిన అడ్వర్టైజింగ్ చీఫ్ సారా పెర్సోనెట్ వైదొలుగుతున్నట్లు మంగళవారం తెెలిపారు. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్​ను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

అడ్వర్టైజింగ్ చీఫ్ సారా పెర్సోనెట్

ఇదీ చదవండి:తొలగించిన ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బైజూస్‌ సీఈఓ.. వారికే ప్రాధాన్యం అని హామీ

ట్విట్టర్​లో మస్క్ మార్పులు.. భారతీయుడికి కీలక బాధ్యతలు.. ఆయన సలహాలతోనే..

Last Updated : Nov 2, 2022, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details