తెలంగాణ

telangana

Google Pay Sachet Loan : చిరువ్యాపారులకు గుడ్ న్యూస్​.. ఈజీగా రూ.15,000 వరకు లోన్​.. ఈఎంఐ నెలకు రూ.111 మాత్రమే!

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 10:53 AM IST

Google Pay Sachet Loan Details In Telugu : మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారా? చిన్న మొత్తంలో రుణాలు కావాలా? అయితే ఇది మీ కోసమే. గూగుల్ పే ఇప్పుడు రూ.15,000 వరకు సాచెట్ రుణాలు అందిస్తోంది. అది కూడా నెలకు కేవలం రూ.111 ఈఎంఐ సౌకర్యంతోనే రుణాలు ఇస్తోంది. మరెందుకు ఆలస్యం పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

Google retail loan business in India
Google Pay Sachet Loan

Google Pay Sachet Loan : చిరువ్యాపారులకు గుడ్​ న్యూస్​. గూగుల్ ఇండియా చిరువ్యాపారులకు రూ.15,000 వరకు సాచెట్ లోన్స్ అందిస్తోంది. గూగుల్ పే (Gpay) యాప్​ ద్వారా సులువుగా ఈ స్మాల్ బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. టెక్​ దిగ్గజం గూగుల్ ఇండియా.. డీఎంఐ ఫైనాన్స్​తో కలిసి ఈ రుణాలను ఇస్తోంది.

నెలకు రూ.111 మాత్రమే!
చిరువ్యాపారులు గూగుల్ పే ద్వారా సులువుగా రూ.15,000 వరకు రుణం తీసుకోవచ్చు. వాస్తవానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇలాంటి చిన్న మొత్తాలను రుణాలుగా తీసుకుంటే.. చాలా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ గూగుల్​ పేలో తీసుకున్న రుణాలకు.. నెలకు రూ.111 చొప్పున ఈఎంఐ చెల్లించుకునే వెసులుబాటు ఉంది.

క్రెడిట్ లైన్స్!
వ్యాపారం చేయాలంటే కచ్చితంగా కొంత పెట్టుబడి (వర్కింగ్ క్యాపిటల్​) ఉండాలి. బ్యాంకులు అంత సులువుగా ఈ రుణాలు మంజూరు చేయవు. ప్రైవేట్​గా రుణాలు తీసుకుంటే వడ్డీలు అధికంగా ఉంటాయి. అందుకే గూగుల్ పే.. ePayLater భాగస్వామ్యంతో.. వ్యాపారులకు క్రెడిట్​ లైన్స్​ను అందిస్తామని ప్రకటించింది. గూగుల్ పే అందించే ఈ క్రెడిట్ లైన్స్​తో.. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ రెండు విధాలుగానూ వ్యాపారులు తమకు కావల్సిన సామగ్రిని, స్టాక్​లను కొనుగోలు చేయవచ్చు.

పర్సనల్ లోన్స్​ కూడా!
గూగుల్ ఇండియా.. ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో.. యూపీఐపై కూడా క్రెడిట్ లైన్స్​ను అందిస్తోంది. అంతేకాదు. యాక్సిస్ బ్యాంక్​ భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలను కూడా మంజూరు చేస్తోంది. అందువల్ల.. వ్యక్తులు తమ గూగుల్ పే యాప్​ ఉపయోగించి పర్సనల్​ లోన్​ కూడా పొందడానికి అవకాశం ఏర్పడింది.

గూగుల్ పే వైస్​ ప్రెసిడెంట్​ అంబరీష్ కెంఘే ప్రకారం, గూగుల్​ పేలో గత 12 నెలల్లో యూపీఐ ద్వారా రూ.167 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అందుకే ఇకపై చిరువ్యాపారులకు కూడా ఇదే వేదికలో బిజినెస్ లోన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆదాయంలో సగం రుణంగా!
నెలవారీ ఆదాయం రూ.30,000 లేదా అంత కంటే తక్కువగా ఉన్న వ్యక్తులకు గూగుల్ పే రుణాలు అందిస్తోంది. ముఖ్యంగా సంపాదన రూ.30,000 ఉన్న వ్యక్తులకు.. వారి ఆదాయంలో సగానికి సమానమైన రూ.15,000లను రుణంగా అందిస్తోంది. గూగుల్ పే ఈ సాచెట్ రుణాలను టైర్​-2 పట్టణాలతో పాటు, అంతకంటే కొంచెం చిన్న పట్టణాల్లోని ప్రజలకు కూడా అందిస్తామని స్పష్టం చేసింది.

ఆర్థిక మోసాల నుంచి రక్షణ!
గూగుల్ ఇండియా.. DigiKavachతో.. ఆన్​లైన్ ఫ్రాడ్స్​ నుంచి​, ఆర్థిక మోసాల నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు గూగుల్​ పే రూ.12,000 కోట్ల విలువైన స్కామ్​లను నిరోధించినట్లు వెల్లడించింది. అలాగే 3,500 ఫేక్ లోన్ యాప్​లు బ్లాక్ అయ్యేలా చర్యలు తీసుకుంది.

SBI Card Festive Offers 2023 : ఎస్​బీఐ కార్డ్ బంపర్​ ఆఫర్స్​.. 27.5% వరకు క్యాష్​బ్యాక్​​​.. రూ.10,000 వరకు డిస్కౌంట్​​​!

Best Child Savings Investment Plan : రోజుకు రూ.167 చాలు.. పిల్లల చదువులు, పెళ్లి కోసం.. రూ.50 లక్షలు పొందండి..!

ABOUT THE AUTHOR

...view details