ETV Bharat / business

Best Child Savings Investment Plan : రోజుకు రూ.167 చాలు.. పిల్లల చదువులు, పెళ్లి కోసం.. రూ.50 లక్షలు పొందండి..!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 10:31 AM IST

Best Child Savings Investment Plan ప్రతీ తల్లిదండ్రులు ఎదుర్కొనే అతిపెద్ద ఆర్థిక సమస్యల్లో ప్రధానమైనవి రెండు! అందులో ఒకటి చదువులు, రెండోది పెళ్లిళ్లు. ఇందు కోసం ముందు నుంచే పక్కా ప్రణాళిక అవసరం. అందుకే.. రోజుకు రూ.167 పొదుపు చేస్తే.. రూ.50 లక్షలు అందుకునే స్కీమ్ అందుబాటులో ఉంది. మరి, ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Best Child Savings Investment Plan
Saving Investment For Children

Best Child Savings Investment Plan : నేటి టెక్నాలజీ యుగంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లల చదువుల ఖర్చులయితే.. తారస్థాయికి చేరుకున్నాయి. డాక్టర్, ఇంజినీరింగ్ చదువులకు వచ్చే సమయానికి.. అస్తులు అమ్మి చదివించాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ఇవి ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే.. ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలనుకుంటే.. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే.. ఏదైనా సేవింగ్ స్కీమ్(Saving Scheme)​లో చిన్నమొత్తాల్లో పెట్టుబడి పెడితే.. వారి అవసరాలకు మంచి రాబడి అందుతుందని చెబుతున్నారు నిపుణులు.

Systematic Investment Plan is Best Saving Scheme : అయితే చాలామంది ఏ స్కీమ్​లో చేరితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చూస్తారు. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్​ సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక మంచి ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు. దీంట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పిల్లల ఉన్నత చదువులకే కాదు వారి పెళ్లికి అవసరమయ్యే డబ్బును సమకూర్చుకోవచ్చు. సిప్​లో రోజుకు 167 రూపాయలు.. అంటే నెలకు రూ.5 వేల పెట్టుబడి పెడితే.. పిల్లలకు 20 ఏళ్లు వచ్చేసరికి రూ. 50 లక్షలు సమీకరించుకోవచ్చని సూచిస్తున్నారు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Sip is Best Option for Saving Investments : ఈ మధ్య కాలంలో ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) పెట్టుబడి విధానం చాలా ప్రాచుర్యం పొందింది. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్లలో డబ్బుల్ని పెట్టుబడిగా పెడతారు. అయితే.. ఇది స్టాక్ మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున స్థిర వడ్డీ రేటు రాబడికి హామీ ఇవ్వబడదు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కంటే సిప్(SIP) రూపంలో పెట్టే పెట్టుబడులతోనే ఆకర్షిణీయ స్థాయిలో లాభాలు పొందొచ్చు. అలాగే ఇందులో రిస్క్ కాస్త తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని, సంపదను నిర్మిస్తుందని నిపుణులు చెబుతుంటారు. దీనికి చక్రవడ్డీ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ ఇన్వెస్ట్​మెంట్ విధానంలో సగటున 12 శాతం నుంచి ఎక్కువ రాబడిని కూడా ఆశించవచ్చని అంటున్నారు.

Gram Suraksha Postal Scheme Details : రోజుకు 50 రూపాయలు పొదుపు.. రూ.35 లక్షలు మీ సొంతం..!

రూ. 50 లక్షలు ఎలా పొందవచ్చో చూడండి.. మీరు పిల్లలు పుట్టగానే.. ప్రతి నెలా వారి పేరు మీద 5వేల రూపాయల చొప్పున సిప్ రూపంలో 20 సంవత్సరాల పాటు పెట్టుబడి ప్రారంభించాలి. అంటే.. ఇక్కడ మీరు సంవత్సరానికి పెట్టే పెట్టుబడి రూ.60వేలు.. అదే 20 సంవత్సరాలకు రూ.12 లక్షలు పెట్టుబడిగా పెడతారు. 12శాతం లెక్కన సగటు రాబడి చూస్తే మీరు మొత్తం రూ.37,95,740 వడ్డీని పొందుతారు. అంటే మీరు 20 ఏళ్ల మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత కట్టిన పెట్టుబడితో కలిపి రూ. 49,95,740 అంటే ఇంచు మించు రూ. 50 లక్షలు పొందుతారన్నమాట. అయితే.. ఈ పెట్టుబడిని మరో ఐదేళ్లు అదనంగా కొనసాగిస్తే ఇంకా ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఒకవేళ మీరు 12 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఆశిస్తే.. ఈ రాబడి రూ. కోటి దాటే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తు అవసరాల కోసం ఆ డబ్బు చక్కగా ఉపయోగపడతుంది.

Best Post Office Saving Schemes for Boy Child : మగ పిల్లల కోసం.. పోస్టాఫీస్ 5 పొదుపు పథకాలు.. మీకు తెలుసా?

Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?

కొత్తగా ఉద్యోగంలో చేరారా? 50:50 ఫార్ములా ఫాలో అయితే మీ లైఫ్​ సూపర్​ హిట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.