ETV Bharat / business

పోస్ట్ ఆఫీస్ X స్టేట్ బ్యాంక్.. ఫిక్స్డ్​ డిపాజిట్​కు ఏది బెస్ట్? అధిక వడ్డీ ఎవరిస్తారు?

author img

By

Published : Jul 19, 2023, 6:30 PM IST

SBI Fixed Deposits vs Post Office Fixed Deposits
ఎస్‌బీఐ ఎఫ్​డీ వ‌ర్సెస్ పోస్టాఫీసు ఎఫ్‌డీ.. ఎక్కువ రిట‌ర్న్స్​ ఇందులోనే!

Fixed Deposit Rates :పెట్టుబ‌డి పెట్టేందుకు చాలా మంది బ్యాంకుల‌ను ఆశ్ర‌యిస్తారు. అందులోనూ ఫిక్స్డ్ డిపాజిట్లనే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. దీనికోసం అనేక బ్యాంకులు, పోస్టాఫీసులు ఉన్నాయి. అయితే.. ఎఫ్​డీకి బ్యాంకు బెట‌రా..? లేదంటే పోస్టాఫీసు అయితే బాగుంటుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Fixed Deposit Interest Rates : మార్కెట్​లో ఇన్వెస్ట్ చేయ‌డానికి నేడు అనేక పెట్టుబడి అవ‌కాశాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు మాత్రం ఫిక్స్​డ్ డిపాజిట్‌ (ఎఫ్​డీ)లో పెట్టుబ‌డి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. చాలా మంది సీనియ‌ర్ సిటిజ‌న్లు, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారు ఇదే బెస్ట్ చాయిస్ అని పరిగ‌ణిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వారు త‌మ ప‌దవి విర‌మ‌ణ అనంత‌రం నిధుల‌ను ఎఫ్​డీలో జ‌మ చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే ఎఫ్​డీకి ఏది అయితే బెట‌ర్ అని ఆలోచిస్తారు. ఫిక్స్​డ్ డిపాజిట్ చేయ‌డానికి బ్యాంకు అయితే బెట‌రని కొంద‌రు, పోస్టాఫీసు మంచి ఎంపిక అని మ‌రికొంద‌రు.. ఇలా ఎవ‌రికి తోచింది వాళ్లు చెబుతారు. అయితే.. మీరు గనుక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ఎఫ్​డీ స్కీమ్​లో లేదా పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్ స్కీమ్​లో పెట్టుబ‌డి పెట్టాల‌ని అనుకుంటున్నారా? అయితే వాటికి సంబంధించిన వ‌డ్డీ రేట్లు, ఇత‌ర ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుందాం.

ఆగ‌స్టు 15 వరకే..
SBI Fixed Deposit Rates : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా త‌మ సాధార‌ణ వినియోగ‌దారులకు అందించే ఎఫ్​డీ ప‌థ‌కాల వ్య‌వ‌ధి 7 రోజుల నుంచి 10 సంవ్స‌త‌రాల వ‌ర‌కు ఉంటుంది. వీటిపై వ‌డ్డీ రేట్లు 3 నుంచి 6.5 శాతం వ‌ర‌కు ఉంటాయి. అదే సీనియ‌ర్ సిటిజ‌న్లు వీటిపై అధిక వడ్డీ పొందుతారు. వారికి వ‌డ్డీ 3.5 నుంచి 7.5 శాతం వర‌కు వ‌స్తుంది. ఎస్​బీఐ త‌మ ప్ర‌త్యేక ఎఫ్​డీ ప‌థ‌కం అమృత్ క‌లశ్ (444 రోజుల ఎఫ్​డీ) పై సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ల‌కు 7.1 శాతం, సీనియ‌ర్ సిటిజ‌న్ వినియోగ‌దారుల‌కు 7.6 శాతం వ‌డ్డీ అందిస్తుంది. కానీ ఈ ప‌థ‌కం ఈ ఏడాది ఆగ‌స్టు 15 వ‌ర‌కే అందుబాటులో ఉంటుంది.

పన్ను మినహాయింపు..
Fixed Deposit Tax Exemption : ఇక పోస్టాఫీసు ఫిక్స్​డ్ డిపాజిట్ ప‌థ‌కాలు ఏడాది నుంచి ప్రారంభ‌మై 5 ఏళ్ల వ‌ర‌కు ఉంటాయి. వినియోగ‌దారులు త‌మ ఏడాది ట‌ర్మ్ ప‌థ‌కంపై 6.9 శాతం వ‌డ్డీ రేట్లు పొందుతారు. రెండు, మూడేళ్ల ప‌థ‌కాలపై 7 శాతం, అయిదేళ్ల ఎఫ్​డీలపై 7.5 శాతం వడ్డీ ల‌భిస్తుంది. ఎస్​బీఐ, పోస్టాఫీసుల్లో 5 సంవత్స‌రాల కంటే ఎక్కువ వ్య‌వ‌ధి ఉన్న ఫిక్స్​డ్ డిపాజిట్ ప‌థ‌కాల‌పై టాక్స్ మిన‌హాయింపు ఉంటుంది. ఇన్​క‌మ్ ట్యాక్స్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80C కింద సుమారు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు రిబేటును పొంద‌వ‌చ్చు.

దీంట్లో ఇన్వెస్ట్​ చేయండి..
Post Office Fixed Deposit : 5 ఏళ్ల పెట్టుబడి కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎస్​బీఐ క‌న్నా పోస్టాఫీసు ట‌ర్మ్ ప‌థకం ఉత్త‌మం. ఇన్వెస్ట‌ర్లు 5 సంవత్స‌రాల స్కీమ్​లో జాయిన్ అవ్వాల‌నుకుంటే పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఎందుకంటే ఇందులో సాధార‌ణ వినియోగ‌దారులు సైతం 7.5 శాతం వ‌డ్డీ రేటు పొంద‌వ‌చ్చు. అదే ఎస్​బీఐలో అయితే సీనియ‌ర్ సిటిజ‌న్లకు మాత్ర‌మే వ‌స్తుంది.

అన్నీ తెలుసుకొని..
Fixed Deposit Details In Post Office SBI : పెట్టుబ‌డిదారులు ఇన్వెస్ట్ చేసే ముందు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకోవాలి. అందుబాటులో ఉన్న ఆప్ష‌న్లు, రిస్క్, రిట‌ర్న్, వ‌డ్డీ రేట్లు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని విశ్లేషించుకోవాలి. వీటిపై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోతే ఎవ‌రైనా ఆర్థిక నిపుణుల్ని సంప్ర‌దించండి. వారి సూచ‌న‌ల్ని బ‌ట్టి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటే మంచి ఫ‌లితాలుంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.