ETV Bharat / business

SBI Card Festive Offers 2023 : ఎస్​బీఐ కార్డ్ బంపర్​ ఆఫర్స్​.. 27.5% వరకు క్యాష్​బ్యాక్​​​.. రూ.10,000 వరకు డిస్కౌంట్​​​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 12:42 PM IST

SBI Card Festive Offers 2023 : దసరా పండుగ వేళ ఎస్​బీఐ కార్డ్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఎస్​బీఐ కార్డ్ వినియోగించి చేసే కొనుగోళ్లపై గరిష్ఠంగా 27.5 శాతం వరకు క్యాష్​బ్యాక్స్ అందిస్తున్నట్లు పేర్కొంది. మరికొన్ని ప్రొడక్టులపై ఏకంగా రూ.10 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. వాస్తవానికి ఎస్​బీఐ కార్డ్​ దాదాపు 2200 రకాల ఆఫర్స్ అందిస్తోంది. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

SBI Card Festive discounts and cashbacks
SBI Card Festive Offers 2023

SBI Card Festive Offers 2023 In Telugu : ఎస్​బీఐ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్​. ఎస్​బీఐ కార్డ్​ దసరా పండుగ సందర్భంగా తమ వినియోగదారుల కోసం ఫెస్టివ్​ ఆఫర్లను ప్రకటించింది. మేజర్ సిటీలతో సహా టైర్​ 2, టైర్​ 3 నగరాల్లోనూ ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్​బీఐ కార్డ్ ఉపయోగించి చేసే కొనుగోళ్లుపై దాదాపు 2200 రకాల ఆఫర్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా వీటిలో మర్చంట్​ ఫండెడ్​​, క్యాష్​బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయని పేర్కొంది.

బంపర్​ ఆఫర్స్
SBI Card Unveils Festive Offer 2023 With Cashbacks : మొబైల్స్​, ల్యాప్​టాప్స్, ఫ్యాషన్​, ఫర్నీచర్​, జ్యువెలరీ, గ్రోసరీస్​​ సహా వివిధ రకాల కేటగిరీ వస్తువులపై ఎస్​బీఐ కార్డ్ ఆఫర్స్ అప్లై అవుతాయి. అంతేకాదు ఎస్​బీఐ కార్డ్ తమ వినియోగాదారుల కోసం ప్రత్యేకం ఈఎంఐ ఫెసిలిటీని, ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తోంది.

లోకల్-​టు-నేషనల్​
ఎస్​బీఐ కార్డ్​ ఈ పండుగ సీజన్​లో.. 600 నేషనల్​ లెవల్​ ఆఫర్స్, 1500 రీజినల్ & హైపర్ లోకల్ ఆఫర్స్అం దిస్తోంది. అయితే ఈ ఆఫర్స్ అన్నీ 2023 నంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

డిస్కౌంట్స్​, క్యాష్​బ్యాక్స్​!
SBI Card Discounts And Cashbacks : దేశంలోని 2700 సిటీల్లో ఎస్​బీఐ కార్డ్ ఫెస్టివ్​ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​, మింత్రా, రిలయన్స్​ రిటైల్ గ్రూప్​, వెస్ట్​సైడ్​, పాంటలూన్స్​, మ్యాక్స్​, తనిష్క్​, టీబీజెడ్​ లాంటి పలు ఈ-కామర్స్ వెబ్​సైట్స్​, రిటైల్ స్టోర్స్​లో ఎస్​బీఐ కార్డ్ వినియోగించి కొనుగోలు చేస్తే 27.5% వరకు క్యాష్​బ్యాక్ ఇస్తోంది. మరికొన్ని ప్రొడక్టులపై​ ఏకంగా రూ.10,000 వరకు ఇన్​స్టాంట్​ డిస్కౌంట్​ లభిస్తుంది.

ఈఎంఐ ఫెసిలిటీ!
SBI Card EMI Offer 2023 : ఎస్​బీఐ కార్డ్.. కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్​టాప్​ కొనుగోళ్లపై కూడా ఈఎంఐ ఫెసిలిటీని కల్పిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్​, ఎల్​జీ, సోనీ, ఒప్పో, వివో, పానాసోనిక్​, వర్ల్​పూల్​, బాష్​, హెచ్​పీ, డెల్​ లాంటి టాప్ బ్రాండ్ ప్రొడక్టులపై ఈఎంఐ సౌకర్యం అందిస్తోంది.

ఎస్​బీఐ కార్డ్​ ఫెస్టివ్ ఆఫర్స్ పూర్తి వివరాల కోసం https://www.sbicard.com/ వెబ్​సైట్​ను సందర్శించండి.

అమెజాన్ ఆఫర్స్
Amazon Great Indian Festival 2023 Offers : అమెజాన్​ ఫెస్టివ్​ సేల్​లో ఎస్​బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోళ్లు చేస్తే ఇన్​స్టాంట్​గా 10% డిస్కౌంట్​ లభిస్తుంది.

బ్యాంక్​ ఆఫ్ బరోడా ఫెస్టివ్ ఆఫర్స్​!
Bank Of Baroda Festive Offers 2023 : బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా దసరా పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్​, ఫ్యాషన్, ట్రావెల్, ఆన్​లైన్ షాపింగ్​, గ్రోసరీ, గృహోపకరణాల కొనుగోళ్లుపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్​, క్యాష్ బ్యాక్స్ ఇస్తోంది. ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​, పేటీఎం, షావోమీ వేదికగా చేసే కొనుగోళ్లుపై కూడా భారీ ఆఫర్స్ అందిస్తోంది.

Amazon Pay Rupay Credit Card EMI Offer : అమెజాన్ పే యూజర్లకు గుడ్​ న్యూస్​.. ​రూపే క్రెడిట్​ కార్డ్​లపై ఈఎమ్​ఐ ఫెసిలిటీ!

Apple India Festive sale : అదిరిపోయే డీల్స్​తో.. యాపిల్ ఫెస్టివల్​ సేల్​.. ఐఫోన్​, మ్యాక్​బుక్స్​పై భారీ డిస్కౌంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.