ETV Bharat / business

Amazon Pay Rupay Credit Card EMI Offer : అమెజాన్ పే యూజర్లకు గుడ్​ న్యూస్​.. ​రూపే క్రెడిట్​ కార్డ్​లపై ఈఎమ్​ఐ ఫెసిలిటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 3:36 PM IST

Updated : Oct 20, 2023, 5:26 PM IST

rupay credit card offers amazon pay
Amazon Pay Rupay Credit Card Emi Offer

Amazon Pay Rupay Credit Card EMI Offer : అమెజాన్ పే పండగ వేళ తమ వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక సౌకర్యాన్ని తీసుకువచ్చింది. రూపే క్రెడిట్​ కార్డ్​లపై ఈఎమ్​ఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​-2023 భాగంగా ఈ ఫెసిలిటీని ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

Amazon Pay Rupay Credit Card EMI Offer : రూపే క్రెడిట్​ కార్డ్​లపై ఈఎమ్​ఐ సదుపాయాన్ని కల్పిస్తోంది అమెజాన్​ పే. పండగల వేళ ఆన్​లైన్​ షాపింగ్​ను మరింత సులభతరం చేసుకునేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చింది. గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​-2023 భాగంగా.. తమ వినియోగదారులకు దీన్ని పరిచయం చేసింది​. 8 ప్రముఖ బ్యాంకులు జారీ చేసే రూపే క్రెడిట్​ కార్డ్​లపై ఈఎమ్​ఐ సదుపాయాన్ని కల్పిస్తుంది అమెజాన్ పే​.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో.. రూపే క్రెడిట్​ కార్డ్​లపై ఈఎమ్​ఐ సౌకర్యాన్ని తీసుకువచ్చినట్లు క్రెడిట్ అండ్​ లెండింగ్, అమెజాన్ పే ఇండియా డైరెక్టర్ మయాంక్​ జైన్​ తెలిపారు. యూజర్లకు సులువుగా లోన్​ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ తరహా విధానాన్ని తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు. దాంతోపాటు కస్టమర్లు తమ సేవింగ్స్​ను పెంచుకునేందుకు ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

How To Resolve Failed UPI Payments : యూపీఐ ట్రాన్సాక్షన్​ ఫెయిల్ అయ్యిందా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

దేశ వ్యాప్తంగా ఉన్న ఆన్​లైన్​ షాపింగ్​ ప్రియులకు ఈ విధానం సౌకర్యంగా ఉంటుందని మయాంక్​ జైన్​ పేర్కొన్నారు. పండగ సీజన్​ కావడం వల్ల ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. దాంతో పాటు డిజిటల్​ పేమెంట్ విధానంలో చెల్లింపులు చేసే తమ కస్టమర్​లకు వివిధ రకాల ఆఫర్లు, రివార్డ్​లు కూడా అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందుకోసం తమ యూజర్లు అమెజాన్​ పే లేటర్​, అమెజాన్​ పే వాలెట్​, యూపీఐ లాంటి డిజిటల్​ పేమెంట్​ విధానాలు అన్నింటీని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.

UPI Credit Line Facility : అకౌంట్​లో డబ్బులు లేకపోయినా UPI పేమెంట్స్.. ఎలాగంటే?
UPI Credit Line Facility : మీరు అర్జెంట్​గా ఎవరికైనా డబ్బులు పంపించాలా? కానీ మీ బ్యాంక్​ అకౌంట్​లో సరిపడా డబ్బులు లేవా? అయినా ఏ మాత్రం చింతించకండి. ఇప్పుడు మీరు సులువుగా.. మీ బ్యాంక్​ అకౌంట్​లో సరిపడా డబ్బులు లేకపోయినా.. యూపీఐ క్రెడిట్​ లైన్స్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. బ్యాంకులు అన్నీ యూపీఐ వినియోగదారులకు ముందస్తుగా క్రెడిట్​ లైన్స్​ జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి ఇచ్చింది. ఈ లేటెస్ట్ ఫెసిలిటీతో.. యూపీఐ వినియోగదారులకు బ్యాంకుల ద్వారా​ ముందస్తు క్రెడిట్ లైన్​ లభిస్తుంది. అంటే లోన్ అమౌంట్​ లభిస్తుంది. దీనిని ఉపయోగించి యూజర్లు తమ పేమెంట్స్ పూర్తి చేయవచ్చు. ఆ తరువాత నిర్దిష్ట సమయంలోపు ఆ క్రెడిట్ రుణాన్ని తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Amazon Smartphone Offers 2023 : అదిరిపోయే పండుగ ఆఫర్లు.. బడ్జెట్ ఫోన్లపై 40%.. ఇయర్​ఫోన్స్​పై 73% వరకు డిస్కౌంట్​!

Top 5 Best Selling Smart Watches in Amazon Sale : తక్కువ ధరకే స్మార్ట్​వాచ్ కొందామనుకుంటున్నారా?.. అయితే అమెజాన్​ సేల్​లో వీటిపై ఓ లుక్కేయండి.!

Last Updated :Oct 20, 2023, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.