తెలంగాణ

telangana

జీఎస్​టీ పరిహారం మొత్తం విడుదల.. రాష్ట్రాలకు రూ. 86 వేల కోట్లు

By

Published : May 31, 2022, 7:57 PM IST

GST Compensation: రాష్ట్రాలకు జీఎస్​టీ పరిహారం మొత్తం చెల్లించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా మరో రూ. 86 వేల 912 కోట్ల బకాయిలను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Centre clears entire GST compensation dues till date, releases Rs 86,912 crore to states
Centre clears entire GST compensation dues till date, releases Rs 86,912 crore to states

GST Compensation: జీఎస్​టీ పరిహారం కింద రాష్ట్రాలకు మరో రూ. 86 వేల 912 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఇప్పటివరకు మొత్తం పరిహారం చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంట్లో రూ. 25 వేల కోట్లను జీఎస్​టీ నిధి నుంచి విడుదల చేయగా.. మరో రూ. 61 వేల 912 కోట్లను సెస్సుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం నుంచి చెల్లించినట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి, మార్చి బకాయిలు రూ. 21,322 కోట్లు.. ఏప్రిల్​, మే బకాయిలు రూ.17,973 కోట్లు.. 2022 జనవరి వరకు పెండింగ్​లో ఉన్న రూ. 47,617 కోట్లను కలిపి మొత్తం రూ.86,912 కోట్లను ఒకేసారి చెల్లించింది కేంద్రం. ఇందులో ఆంధ్రప్రదేశ్​కు రూ.3,199 కోట్లు, తెలంగాణకు రూ.296 కోట్లు ఇచ్చింది.

2017, జులై 1న దేశంలో వస్తుసేవల పన్నును (జీఎస్​టీ) అమల్లోకి తెచ్చింది కేంద్రం. జీఎస్​టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటు భర్తీకి ఐదేళ్లపాటు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వాలని జీఎస్​టీ చట్టం చెబుతోంది. ఇందులో భాగంగానే కేంద్రం తాజాగా మరోసారి పరిహారం ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details