తెలంగాణ

telangana

రూ.6 లక్షల బడ్జెట్​లోనే కొత్త కారు కొనాలా? ఫేమస్ మోడల్స్ ఏవో తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 3:29 PM IST

మధ్య తరగతి కుటుంబాల కారు ఆశలు నెరవేరాలంటే, తక్కువ ధరల్లో లభించే కార్లే ఉండాలి. ఎస్‌యూవీల ప్రపంచంలో చిన్నకార్లు ఉత్పత్తి చేస్తున్నారా? రూ. 6 లక్షల రూపాయల్లోపు ఏఏ కార్లు అందుబాటులో ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.

CARS UNDER 6 LAKH
NEW CARS UNDER 6 LAKH

దేశీయ మోటార్‌ రంగంలో కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మైలేజ్‌ తక్కువ ఇచ్చినా ఎస్‌యూవీల కొనుగోలుకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల కంపెనీలు కూడా చిన్న కార్ల బదులు ఎస్‌యూవీలు తయారీకే మొగ్గుచూపుతున్నాయి. మరోవైపు సెమీ కండక్టర్‌ కొరత, సరఫరా గొలుసులో అంతరాయం, పెరిగిన ఇన్‌పుట్‌ ఖర్చులు, కఠినమైన ప్రభుత్వ నిబంధనల వల్ల కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

దీంతో భారత్‌ మార్కెట్లో బడ్జెట్‎లో దొరికే కార్లు, అందులోనూ ఇప్పుడు రూ. 6 లక్షల బడ్జెట్‌లో లభించే కార్లు పరిమితమయ్యాయి. తక్కువ బడ్జెట్‌‎లో అందుబాటులో ఉన్న కార్లలో మూడు మోడల్స్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి ఎస్‌-ప్రెస్సో, రెనో క్విడ్‌. ఈ మూడు ఇప్పుడు రూ.6 లక్షల బడ్జెట్‌లో లభిస్తున్న కార్లుగా చెప్పొచ్చు. వీటి విశేషాలు మరింత లోతుగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఆల్టో కె10:
మధ్యతరగతి వినియోగదారుల మెచ్చే బ్రాండ్‌ మారుతి సుజుకి ఇండియా. చిన్నకార్ల ఉత్పత్తిలో మారుతిని మించిన సంస్థ మరొకటి లేదనే చెప్పాలి. ఇప్పటికీ దేశంలో సరసమైన కార్లు ఉత్పత్తి చేస్తున్న కంపెనీ మారుతి. ఆల్టో 800 ఉత్పత్తి నిలిపివేసినా, ఆల్టో కే10 కార్‌మేకర్‌ ఎంట్రీ లెవల్‌ ఉత్పత్తిగా చెప్పవచ్చు. మారుతి సుజుకి ఆల్టో కె10 ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షలు (EX-SHOWROOM) మధ్య లభిస్తోంది. ఎంట్రీ - లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ టాప్‌-స్పెక్‌ వేరియంట్‌ రూ. 6 లక్షలు (OTR) కిందకు రాదు. కొనుగోలుదారులు లో, మిడ్‌-స్పెక్‌ వేరియంట్‌లను చూడవచ్చు.

మారుతి సుజుకి ఆల్టో కే10

ఆల్టో కే10 మోడల్‌ కారు 1.0 లీడర్‌ కె 10సీ పెట్రోల్‌ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 67 పీఎస్‌ 89ఎన్‌ఎమ్‌ అభివృద్ధి చేస్తుంది. ఆల్టో కే 10 ఇంజిన్‌ 5-స్పీడ్‌ MT లేదా 5-స్పీడ్‌ AMTతో జత చేయవచ్చు. 5-స్పీడ్‌ MTతో CNG ఆప్షన్‌ (57 PS 82 NM) కూడా ఉంది. కార్‌మేకర్‌ అందించే భారీ ఆఫర్‌ ఉంటే తప్ప ఈ కారు రూ.6 లక్షల (OTR) లోపు CNG ఆప్షన్‌ సాధ్యం కాకపోవచ్చు. అయితే కొనుగోలుదారులు పెట్రోల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి ఆల్టో కే10

మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో:
మారుతీ ఎస్-ప్రెస్సో అద్భుతమైన అందుబాటులో ఉన్న ఆఫర్‌. మారుతి ఆల్టో కె10 కారు మోడల్‌కు తగ్గట్టే ఎస్‌-ప్రెస్సోలో పవర్‌ ట్రెయిన్‌ ఉంటుంది. మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో ధర రూ.4.26 లక్షల నుంచి రూ. 6.11 లక్షల మధ్య ఉంటుంది. ఇది ఎక్స్‌షోరూమ్‌ ధర. పెట్రోల్‌, సీఎన్‌జీ వెర్షన్లలో టాప్‌-స్పెక్‌ వేరియంట్‌లు రూ. 6 లక్షల (OTR) కన్నా తక్కువ ధరకు అందుబాటులో లేదు. అయితే కొనుగోలుదారులు లోయర్‌, మిడ్‌-స్పెక్‌ వేరియంట్‌లను కొనుగోలు చేసుకోవచ్చు.

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో

రెనో క్విడ్‌:
మన మార్కెట్​లో తక్కువ ధరకు లభిస్తున్న మరో కారు రెనో క్విడ్‌. దీని ప్రస్తుత ధర రూ. 4.69 లక్షల నుంచి రూ. 6.44 (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది. రెనో క్విడ్‌ మోడల్‌ కారు 1.0-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. 68 PS 91 NM శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ను 5-స్పీడ్‌ MT లేదా 5-స్పీడ్‌ AMTతో జత చేయొచ్చు. రూ.6లక్షల (OTR) బడ్జెట్‌తో కొనుగోలుదారులు ఈ ఎంట్రీ-లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ దిగువ, మధ్య-స్పెక్‌ వేరియంట్‌లను కలిగి ఉంటుంది.

రెనో క్విడ్
రెనో క్విడ్
రెనో క్విడ్

రూ.15 లక్షల బడ్జెట్​లో మంచి కారు కొనాలా? టాప్​-10 మోడల్స్ ఇవే!

తక్కువ బడ్జెట్లో పెద్ద కారు కొనాలా? టాప్​-6 సెవెన్​ సీటర్​​ కార్స్ ఇవే!

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్​-10 కార్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details