ETV Bharat / business

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్​-10 కార్లు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 10:45 AM IST

The 10 Most Expensive Cars In The World In Telugu : మీరు కార్ లవర్సా? ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. సూపర్ లగ్జరీ ఫెసిలిటీస్​తో, సాధారణ ఐశ్వర్యవంతులకు కూడా అందనంత ఖరీదైన టాప్​-10 కార్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

most expensive cars in the world in 2023
Top 10 most expensive cars in the world

The 10 Most Expensive Cars In The World : ఐశ్వర్యవంతులు తమ హోదాకు తగిన కార్లు కొనాలని కలలుగంటారు. అందుకోసం ఎన్ని కోట్లయినా సరే లెక్కచేయకుండా ఖర్చు పెట్టడానికి వెనుదీయరు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సూపర్ లగ్జరీ కార్లను తయారు చేస్తూ ఉంటాయి. ఈ కార్ల డిజైన్​ చాలా ప్రత్యేకంగా ఉండేలా చూస్తాయి. పైగా వీటిలో అద్భుతమైన ఫీచర్లను కూడా పొందుపరుస్తాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఇక చెప్పనవసరమే లేదు. అందుకే ఈ కార్లలంటే అందరికీ మోజు. అందుకే ఈ ఆర్టికల్​లో ప్రపంచంలోని టాప్​-10 సూపర్ ఎక్స్​పెన్సివ్ కార్ల గురించి తెలుసుకుందాం.

  1. Rolls-Royce Boat Tail : ఈ రోల్స్ రాయిస్ బోట్​ టైల్​ కారు ధర 27.8 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.2,31,65,05,890 ఉంటుంది. దీని డిజైన్​, ఫీచర్స్​, స్పెక్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి.
    Rolls-Royce Boat Tail
    రోల్స్ రాయిస్ బోట్ టైల్
  2. Bugatti La Voiture Noire : ఈ బుగట్టి లా వాయిచర్​ నోయిర్​ కారు ధర 18.68 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.21,55,64,91,386 ఉంటుంది. ఈ సూపర్ లగ్జరీ కార్​ లుక్​ అద్భుతంగా ఉంటుందంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.
    Bugatti La Voiture Noire
    బుగట్టి లా వాయిచర్​ నోయిర్
  3. Pagani Zonda HP Barchetta : ఈ పగని జోండా హెచ్​పీ బార్చెట్టా కారు ధర 17 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.1,41,65,07,150 ఉంటుంది. ఐశ్వర్యవంతుల టాప్​ ఛాయిస్​ల్లో ఇది ఒకటి.
    Pagani Zonda HP Barchetta
    పగని జోండా హెచ్​పీ బార్చెట్టా
  4. SP Automotive Chaos : ఈ ఎస్​పీ ఆటోమోటివ్ ఖోస్​ కారు ధర 14.4 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.1,19,97,94,320 ఉంటుంది. దీని ఫీచర్స్, స్పెక్స్​ అన్నీ సూపర్​గా ఉంటాయి.
    SP Automotive Chaos
    ఎస్​పీ ఆటోమోటివ్ ఖోస్
  5. Rolls Royce Sweptail : ఈ రోల్స్ రాయిస్ స్వెప్టైల్​ కారు ధర 13 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.1,08,31,47,650 ఉంటుంది. సూపర్ స్టైలిష్ లుక్​తో కార్​ లవర్స్​ను ఇట్టే ఆకట్టుకుంటుంది.
    Rolls Royce Sweptail
    రోల్స్ రాయిస్ స్వెప్టైల్
  6. Bugatti Centodieci : ఈ బుగట్టి సెంటోడీసి కారు ధర 9.2 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.76,64,81,900 ఉంటుంది. కోటీశ్వరుల టాప్​ ఛాయిస్​ల్లో ఇది కూడా ఒకటి.
    Bugatti Centodieci
    బుగట్టి సెంటోడీసి
  7. Mercedes Maybach Exelero : ఈ మెర్సిడెస్ మేబ్యాక్ ఎక్సెలెరో కారు ధర 8 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.66,65,06,000 ఉంటుంది. సెలబ్రిటీలు ఎక్కువగా కొనుగోలు చేసే టాప్​ కార్​ ఇది.
    Mercedes-Maybach Exelero
    మెర్సిడెస్ మేబ్యాక్ ఎక్సెలెరో
  8. Pagani Huayra Codalunga : ఈ పగని హుయ్రా కోడలుంగా కారు ధర 7 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.58,32,92,850. రాయల్​ లుక్​లో అద్భుతంగా ఉంటుంది.
    Pagani Huayra Codalunga
    పగని హుయ్రా కోడలుంగా
  9. Bugatti Mistral : ఈ బుగట్టి మిస్ట్రాల్ కారు ధర 5 మిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.41,66,37,750 ఉంటుంది. సూపర్ లగ్జరీ ఫెసిలిటీస్ ఉండే ఈ కారు డిజైన్​ అదిరిపోతుంది.
    Bugatti Mistral
    బుగట్టి మిస్ట్రాల్
  10. Bugatti Bolide : ఈ బుగట్టి బోలిడే కారు ధర 4.3 మిలియన్ డాలర్లు. అంటే దీని ఖరీదు సుమారుగా రూ.35,83,08,465 ఉంటుంది. అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు దీని సొంతం.
    Bugatti Bolide
    బుగట్టి బోలిడే

కొత్త బండి కొనాలా? టాప్​ -10 సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్​ బైక్స్​ ఇవే!

బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్​ ఉన్న టాప్​-7 కార్స్ ఇవే! స్టార్ రేటింగ్, ఎయిర్​ బ్యాగ్స్ లెక్క ఇలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.