తెలంగాణ

telangana

దెబ్బకొట్టిన ఒమిక్రాన్​.. సెన్సెక్స్ 765 పాయింట్లు డౌన్

By

Published : Dec 3, 2021, 3:41 PM IST

Omicron Effect On Stock Market: కరోనా కొత్త వేరియంట్​పై అంతర్జాతీయంగా నెలకొన్న భయాలతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవి చూశాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 765 పాయింట్ల నష్టంతో 57,696 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 205 పాయింట్లు క్షీణించి 17,197 వద్ద సెషన్​ను ముగించింది.

Nifty, Sensex falls
భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

Omicron Effect On Stock Market: వరుసగా రెండో శుక్రవారం కూడా స్టాక్​ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 765 పాయింట్లు కోల్పోయి 57,696 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 205 పాయింట్లు క్షీణించి 17, 197వద్ద స్థిరపడింది.

నష్టాలకు కారణాలు ఇవే..

  • కొత్త వేరియింట్​ ఒమిక్రాన్​ కేసులు దేశీయంగా వెలుగు చూడడం మదుపరులను ఆందోళనకు గురిచేసింది.
  • ఇప్పటికే వేర్వేరు రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయగా.. వ్యాపారాలపై మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయాలు మార్కెట్లను వెంటాడాయి.
  • అంతర్జాతీయంగా కూడా పెరుగుతోన్న కరోనా కేసులు, విదేశీ సంస్థాగత మదుపరులను వెనకడుగు వేసేలా చేశాయి.
  • మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం ఒక్కటి కూడా లేకపోవడం నష్టాలకు మరో కారణంగా చెప్పవచ్చు.
  • అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసినా... ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడడం మదుపరులు సెంటిమెంట్​ను దెబ్బతీసింది.
  • స్టాక్​ మార్కెట్​లో ఉండే బడా కంపెనీలు కూడా నష్టాల్లో ట్రేడవడం మదుపరులను ఆందోళనకు గురిచేసింది.
  • బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాలను చవి చూశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 58,757 పాయింట్ల అత్యధిక స్థాయి, 57,641 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,490 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,181 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో

ముప్పై షేర్ల ఇండెక్స్​లో ఎల్​ అండ్​ టీ, టాటా స్టీల్​, టీసీఎస్​ ​, అల్ట్రాటెక్ సిమెంట్​ షేర్లు మినహా మిగతా అన్నీ నష్టాల్లో ముగిశాయి.

ఇవీ చూడండి:

వెబ్​సైట్​లో మీ ఆదాయపు వివరాలు కనిపించట్లేదా?

RBI Digital Currency: డిజిటల్‌ కరెన్సీ దిశగా ఆర్‌బీఐ అడుగులు

Opec oil output: ఒమిక్రాన్‌ వచ్చినా.. మారని ఒపెక్‌ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details