ETV Bharat / business

వెబ్​సైట్​లో మీ ఆదాయపు వివరాలు కనిపించట్లేదా?

author img

By

Published : Dec 3, 2021, 1:45 PM IST

income tax return filing
ఆదాయ పన్ను శాఖ వెబ్​సైటు

Online income tax return: గత ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు డిసెంబరు 31 చివరి తేదీ. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైటులో ముందే నింపిన పన్ను పత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరి మీ ఆదాయం, పన్ను చెల్లించిన వివరాలు వెబ్‌సైటులో కనిపించకపోతే ఏం చేయాలంటే..?

Online income tax return: గత ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు డిసెంబరు 31 చివరి తేదీ. ఈ లోపు కచ్చితంగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. కొత్తగా తీసుకొచ్చిన ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైటులో ముందే నింపిన పన్ను పత్రాలు సిద్ధంగా ఉన్నాయి. చేయాల్సిందల్లా.. ఆ వివరాలను ఒకసారి సరిచూసుకొని, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడమే. తర్వాత ఇ-వెరిఫై చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, మీ ఆదాయం, పన్ను చెల్లించిన వివరాలు ఇన్‌కంట్యాక్స్‌ వెబ్‌సైటులో కనిపించకపోతే.. అప్పుడు ఏం చేయాలి?

Income tax return website: ఆదాయం, పన్ను చెల్లింపు వివరాలు ఆదాయపు పన్ను వెబ్‌సైటులోని మీ ఖాతాలో కనిపించకపోవడానికి పలు కారణాలు ఉండొచ్చు. ఆదాయపు పన్ను శాఖ దీనిపై కొన్ని వివరాలూ తెలియజేస్తోంది.

  • మీ దగ్గర పన్ను వసూలు చేసిన వారు మీ వివరాలను నమోదు చేయకపోవడం.
  • పన్ను వసూలు చేసే వారికి మీ పాన్‌ వివరాలు సరిగా ఇవ్వకపోవడం
  • పాన్‌ వివరాల్లో తప్పులు దొర్లడం
  • టీడీఎస్‌/టీసీఎస్‌ చేసిన వ్యక్తులు/సంస్థలు మీ పాన్‌ వివరాలను తప్పుగా పేర్కొనడం లేదా పాన్‌ వివరాలను అసలు తెలియజేయకపోవడం
  • పన్ను చెల్లింపునకు సంబంధించిన చలాన్ల వివరాలను తప్పుగా పేర్కొనడంలాంటి సందర్భాల్లో మీ ఆదాయం, పన్ను వివరాలు మీ ఖాతాలో కనిపించకపోవచ్చు.

ఇదీ చూడండి: రుణం తీసుకోవాలా? ఏ అవసరానికి ఏది​ బెటర్?

ఏం చేయాలంటే..

  • టీడీఎస్‌/టీసీఎస్‌ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.
  • పాన్‌ను తప్పుగా పేర్కొంటే.. ఆ వివరాలను పాన్‌ కరెక్షన్‌ స్టేట్‌మెంట్‌ ద్వారా సరి చేయాలి. ఇప్పటికే తప్పుగా పేర్కొన్న పాన్‌ వివరాలనూ తెలియజేయాలి.
  • టీడీఎస్‌/టీసీఎస్‌ చేసిన వ్యక్తులు ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు జమ చేసే లోపు పాన్‌ వివరాలు ఇవ్వకపోతే.. ఇప్పుడు ఆ వివరాలను పేర్కొంటూ.. కరెక్షన్‌ స్టేట్‌మెంట్‌ను ఆదాయపు పన్ను శాఖకు అందించాలి.
  • చలాన్‌ వివరాల్లో తప్పు దొర్లితే ఆ వివరాలను బ్యాంకు దృష్టికి తీసుకెళ్లి, సరి చేయించుకోవాలి.

Annual information statement: ఆదాయపు పన్ను వెబ్‌సైటులోని మీ ఖాతాకు వెళ్లి, మీకు వచ్చిన ఆదాయాలు, చెల్లించిన పన్ను వివరాలన్నీ అందులో కనిపిస్తున్నాయా లేదా చూసుకోండి. ఇప్పుడు వార్షిక ఆదాయ నివేదిక (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌)నూ ఆదాయపు పన్ను శాఖ అందిస్తోంది. దీన్ని పరిశీలించండి. సరైన వివరాలతో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడే ఎలాంటి చిక్కులూ ఉండవు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.