తెలంగాణ

telangana

వరుస లాభాలు చూసి స్టాక్​ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా?

By

Published : Oct 31, 2019, 5:06 PM IST

ఇటీవలి కాలంలో స్టాక్​ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ నేడు ఇంట్రాడేలో జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా అదే జోరుతో కొనసాగుతోంది. ఇలాంటి సమయాల్లో స్టాక్​ మార్కెట్​ పెట్టుబుడులపై ఏర్పడే సందేహాలకు నిపుణుల సలహాలు మీ కోసం.

స్టాక్​ మార్కెట్లో పెట్టుబడికి సలహాలు

కొంత కాలంగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇటీవల ర్యాలీ అవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ నేడు ఇంట్రాడేలో జీవన కాల గరిష్ఠాన్ని దాటింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పెట్టుబడిదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మ్యూచువల్ ఫండ్ల మదుపరులు ఏం చేయాలి? స్టాక్​ మార్కెట్​ నిపుణులు ఏమంటున్నారు?

ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడినపడలేదు..!

ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడిలో పడిందన్న సూచనలు లేవని... ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ల మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సూచీలు దూసుకుపోతున్నప్పటికీ... మార్కెట్ మొత్తం సానుకూల ప్రదర్శన చేయట్లేదని, దీనికి సమయం పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

లాభాలున్నా.. ప్రదర్శన అంతంత మాత్రమే..

కొన్ని కంపెనీల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని స్టాక్​ల ధరలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటి ప్రదర్శన స్వల్ప కాలంలో మంచి స్థాయిలో లేదు. వాల్యూయేషన్ మంచిగా ఉండి, సమీప కాలంలో మెరుగైన ఆర్థిక ఫలితాలున్న వాటిలో పెట్టుబడులు పెట్టొచ్చు. వీటి ద్వారా ఇండెక్స్​ రికవరీ నెమ్మదిగా ఉన్నప్పటికీ మంచి లాభాలను ఆశించవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

వరుస లాభాలు చూసి స్టాక్​ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా?

ఇదీ చూడండి: వాట్సాప్​ డేటాను చోరీ చేసిన ఇజ్రాయెల్​ స్పైవేర్​!

ABOUT THE AUTHOR

...view details