తెలంగాణ

telangana

మార్కెట్లలో ఉగాది ఉత్సాహం- సెన్సెక్స్ 661 ప్లస్​

By

Published : Apr 13, 2021, 3:43 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 661 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 14,500 మార్క్ దాటింది. వాహన, బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా లాభాలను గడించాయి. ఐటీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

stocks close huge profits
స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

ఉగాది పర్వదినాన (మంగళవారం) స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 661 పాయింట్లు పెరిగి 48,544 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 14,505 వద్దకు చేరింది.

ఇటీవలి భారీ నష్టాల నుంచి ఆర్థిక షేర్లు వేగంగా రికవరీ అవడం లాభాలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. వాహన షేర్లు కూడా దన్నుగా నిలిచినట్లు పేర్కొన్నారు. దేశంలో మరో కొవిడ్​ టీకా (స్పుత్నిక్​-వి) అత్యవసర వినియోగ అనుమతులు పొందడం మదుపరుల్లో సానుకూలతలు పెంచినట్లు వెల్లడించారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 48,627 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,775 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,528 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,274 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎం&ఎం, బజాజ్ ఫిన్​సర్వ్​, బజాజ్ ఫినాన్స్, మరుతీ, యాక్సిస్​ బ్యాంక్, ఓఎన్​జీసీ భారీగా లాభాలను నమోదు చేశాయి.

టీసీఎస్​, డాక్టర్​ రెడ్డీస్​, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, ఇన్ఫోసిస్​ ఎక్కువగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా.. టోక్యో, హాంకాంగ్, సియోల్​ సూచీలు లాభాలను గడించాయి.

ఇదీ చదవండి:జీఎస్​టీ వసూళ్లు@ రూ.5.48 లక్షల కోట్లు!

ABOUT THE AUTHOR

...view details