తెలంగాణ

telangana

Fuel Price Today: మరోసారి పెరిగిన చమురు ధరలు

By

Published : Oct 21, 2021, 7:52 AM IST

దేశంలో ఇంధన​ ధరల (Fuel Price Today) పెంపు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై లీటరుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

fuel prices today
మరోసారి పెరిగిన చమురు ధరలు

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol price hike) మరోసారి పెరిగాయి. తాజాగా గురువారం పెట్రోల్​, డీజిల్​పై లీటరకు 35 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.106.54కు చేరగా.. డీజిల్​ ధర రూ.95.27కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర (Mumbai Diesel Price Today) 34 పైసలు పెరిగి రూ.112.41కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర 37 పైసలు పెరిగి రూ.103.22 వద్ద కొనసాగుతోంది.

కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Today Diesel Price) ధర 34 పైసలు పెరిగి రూ.107.07కి చేరింది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు పెరిగి​ రూ.98.35 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో లీటర్​ పెట్రోల్​​ (Chennai Diesel Price Today) ధర రూ.103.58 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర​ రూ.99.56గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 36 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ ధర రూ.110.78కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​ రూ.103.90 కి చేరింది.

గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.112.48గా ఉంది. డీజిల్​ లీటర్​కు రూ.104.99 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్టణంలో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.22 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.103.76కి చేరింది.

ఇదీ చూడండి :2022లో భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు!

ABOUT THE AUTHOR

...view details