ETV Bharat / business

2022లో భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు!

author img

By

Published : Oct 20, 2021, 6:45 PM IST

దేశంలోని ఉద్యోగులకు శుభవార్త! 2022లో అనేక సంస్థలు పెద్ద ఎత్తున వేతనాలు పెంచాలని (Salary hike news) యోచిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. రాబోయే 12 నెలల్లో మెరుగైన వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉండటం వల్ల 2022లో ఆసియా-పసిఫిక్‌లోనే అత్యధికంగా వేతనాలు పెరుగుతాయని ఓ ప్రముఖ సంస్థ తన నివేదికలో పేర్కొంది. (Salary Budget planning report)

india salary hikes
భారీగా పెరగనున్న జీతాలు

దేశంలో ఉద్యోగులకు వచ్చే ఏడాది వేతనాలు (Salary hike in 2022) పెరగనున్నట్లు ఓ సర్వేలో తేలింది. తమ సంస్థల్లోని ప్రస్తుత ఉద్యోగులను నిలుపుకోవడం, కొత్తవారిని ఆకర్షించడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి పెద్ద ఎత్తున వేతనాలు పెంచేందుకు (Salary hike news) కంపెనీలు వ్యూహరచన చేస్తున్నట్లు వెల్లడైంది. ఫలితంగా ప్రస్తుత సంవత్సరంతో (8 శాతంతో) పోల్చుకుంటే.. 2022లో 9.3శాతం జీతభత్యాలు పెరగనున్నట్లు తేలింది. ఈ మేరకు 2021 (India Salary hikes 2022) మే- జూన్​ నెలల్లో విల్లీస్ టవర్స్ వాట్సన్​ అనే సంస్థ చేసిన సర్వేలో వేతనాల పెంపుపై పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 'శాలరీ బడ్జెట్ ప్రణాళిక రిపోర్టు' (Salary Budget planning report) పేరుతో నివేదిక విడుదల చేసింది. (Salary budget survey 2022)

రాబోయే 12 నెలల్లో మెరుగైన వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉండటం వల్ల 2022లో ఆసియా-పసిఫిక్‌లోనే అత్యధికంగా వేతనాలు పెరుగుతాయని నివేదికలో పేర్కొంది. (Salary budget survey 2022)

సర్వేలోని కీలక అంశాలు

  • భారత్​లో మెజారిటీ (52.2 శాతం) కంపెనీలు రాబోయే 12 నెలలకు సానుకూల వ్యాపార ఆదాయాన్ని అంచనా వేస్తున్నాయి. ఇది 2020 నాలుగో త్రైమాసికంలో 37 శాతంగా ఉంది.
  • 30 శాతం కంపెనీలు రాబోయే 12 నెలల్లో నియామకాలు భారీగా చేపట్టాలని యోచిస్తున్నాయి. ఇది 2020 కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
  • ఇంజనీరింగ్​(57.5శాతం) ఐటీ(53.4శాతం), సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యాపారాలు(34.2శాతం), అమ్మకాలు(37శాతం), ఫైనాన్స్​(11.6 శాతం) వంటి కీలకమైన సెక్టార్లలో నియామకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
  • హైటెక్ రంగం 2022లో అత్యధికంగా 9.9 శాతం వేతనాలు పెరుగుతాయి. వినియోగదారుల ఉత్పత్తులు, రిటైల్ రంగంలో 9.5 శాతం చొప్పున.. తయారీ రంగంలో 9.30 శాతం పెరుగనున్నట్లు అంచనా.
  • కొవిడ్-19తో ఆటోమేషన్, కృత్రిమ మేధతో సహా పలు పరిశ్రమల్లో పెరిగిన డిజిటలైజేషన్ ప్రక్రియ హైటెక్ రంగంలో జీతాల పెరుగుదలను సానుకూలంగా ప్రభావితం చేసింది.

ఇంధన రంగంలో అంతంతే..

మరోవైపు, ఇంధన రంగంలో వార్షిక వేతన పెరుగుదల అతి తక్కువగా ఉంది. 2021లో వేతనాలు 7.7 శాతం మాత్రమే పెరిగాయి. 2022లోనూ ఈ రంగంలోని వారికి వేతనాలు పెద్దగా పెరిగే అవకాశం లేదు. 7.9 శాతం వేతన పెరుగుదల అంచనాలతో ఈ రంగం జాబితాలో అట్టడుగున ఉందని నివేదిక తెలిపింది.

ప్రస్తుత సూక్ష్మఆర్థిక వ్యవస్థ పరిస్థితులు, కరోనా ప్రభావం ఇంధన రంగంపై తీవ్రంగా ప్రభావం చూపిందని నివేదిక అంచనా వేసింది. పరిశుద్ధ ఇంధన రంగంపై భారత్ దృష్టిసారిస్తున్న నేపథ్యంలో.. పునరుత్పాదక ఇంధన రంగంలోని ఉద్యోగుల వేతనలు పెరుగుతాయని తెలిపింది.

ఇదీ చదవండి: Evergrande: సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్​ కంపెనీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.