తెలంగాణ

telangana

Cryptocurrency News: క్రిప్టో కుదేల్‌.. బిట్‌ కాయిన్‌, ఈథర్‌ ధరలు డౌన్​

By

Published : Dec 5, 2021, 8:46 AM IST

cryptocurrency falls, bitcoin bear market

Cryptocurrency falling down: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలు కుదేలవుతున్నాయి. అత్యంత ప్రజాదరణ ఉన్న క్రిప్టో కరెన్సీలైన బిట్‌కాయిన్‌, ఈథర్‌లు శనివారం నాటి మార్కెట్లో దిగాలు పడ్డాయి. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడడం.. భారత్​లో క్రిప్టోను మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం వంటి కారణాల వల్ల క్రిప్టో కరెన్సీ సెంటిమెంటు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది.

Cryptocurrency falling down: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలు కుదేలవుతున్నాయి. ఇందుకు ఒమిక్రాన్‌ పరిణామాలకు తోడు భారత పరిణామాలు సైతం తోడయ్యాయి. కేవలం కొద్ది రోజుల్లోనే 38కి పైగా దేశాల్లో ఒమిక్రాన్‌ జాడలు కనిపించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ కేసులు బయటపడగా శుక్రవారం మన సూచీలు సైతం నేలచూపులు చూశాయి. మరో వైపు, భారత్‌ క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా పేరు మార్చి, మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ కిందకు తీసుకురావాలని గట్టిగా భావిస్తుండడం వల్ల క్రిప్టో కరెన్సీ సెంటిమెంటు దెబ్బతిన్నట్లుంది. మరో వైపు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ కఠిన ఆంక్షల వైపు మళ్లడమూ బలహీనతలను తెచ్చిపెట్టింది.

గంటలో 10,000 డాలర్లు కోల్పోయి..

Bitcoin bear market: అత్యంత ప్రజాదరణ ఉన్న క్రిప్టో కరెన్సీలైన బిట్‌కాయిన్‌, ఈథర్‌లు శనివారం నాటి మార్కెట్లో దిగాలు పడ్డాయి. ఒక దశలో బిట్‌ కాయిన్‌ 42,000 డాలర్ల దిగువకు; ఈథర్‌ 3,500 డాలర్ల దిగువకు చేరుకున్నాయి. ఈ రెండూ 16శాతం, 15 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. బిట్‌ కాయిన్‌ విషయానికొస్తే శనివారం ఒక గంట వ్యవధిలోనే 10,000 డాలర్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుని 48,000 డాలర్ల వద్ద తచ్చాడింది. ఈథర్‌ కూడా తర్వాత కోలుకుని 3900 డాలర్లకు చేరుకుంది. ఈ రెండూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వార్తలు వచ్చినప్పటి నుంచీ అంతర్జాతీయ మార్కెట్లతో పాటే హెచ్చుతగ్గులు చవిచూస్తూ వచ్చాయి. నవంబరు 10న 69,000 డాలర్ల వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని చూసిన బిట్‌ కాయిన్‌ ఇపుడు 30శాతం దిగువన చలిస్తోంది. సాధారణంగా ఆల్‌టైం గరిష్ఠాల నుంచి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ పడితే దాన్ని బేర్‌మార్కెట్‌గా పరిగణిస్తుంటారు. అంటే బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ ఇపుడు బేర్‌ చేతుల్లో చిక్కిందన్నమాట. కార్డనో, సొలానా, పాలీగాన్‌, షిబా ఇను వంటి క్రిప్టోకరెన్సీలు సైతం 13-20 శాతం వరకు నష్టాలను చవిచూశాయి.

ఇదీ చూడండి:బిట్​కాయిన్​పై 'బేర్' పంజా.. ప్రభుత్వ నియంత్రణే కారణం!

Nirmala sitharaman on crypto:

"క్రిప్టో కరెన్సీలపై చాలా ఊహాగానాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అసలు ఆరోగ్యకరమైన అంశాలు కాదు. పార్లమెంటులోకి వస్తున్న ప్రతిపాదిత క్రిప్టో కరెన్సీ బిల్లును ఆమూలాగ్రం చర్చించాకే కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని గుర్తు పెట్టుకోవాలి. ఈ ఏడాది జీడీపీ గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా వెలువడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మనం కొనసాగుతున్నాం. "

-నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి (శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో

"దేశంలో కొన్ని ప్రాంతాల్లో సరఫరా వైపు ఇబ్బందుల కారణంగా ఆహార ధరలు పెరిగాయి. జనవరి కల్లా ఇవి తగ్గుతాయి. ఎయిరిండియాను డిసెంబరు 31లోగా టాటా గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లేలా చేస్తాం" అని నిర్మలా సీతారామన్​ తెలిపారు.

ఇదీ చూడండి:'బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది లేదు'

ఇదీ చూడండి:క్రిప్టోకరెన్సీతో ఉగ్రవాదులకు నిధులు చేరే ముప్పు..త్వరలో కేంద్రం చర్యలు!

ABOUT THE AUTHOR

...view details