ETV Bharat / business

ఎస్​బీఐ కార్డ్ నుంచి 3 కొత్త 'ట్రావెల్​ క్రెడిట్ కార్డ్స్'​ - ఫీచర్స్ & బెనిఫిట్స్ ఇవే! - SBI Card Travel Credit Cards 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 12:00 PM IST

sbi Credit Cards 2024
SBI Card Travel Credit Cards 2024

SBI Card Travel Credit Cards 2024 : విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్​. ఎస్‌బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 3 ట్రావెల్​ క్రెడిట్‌ కార్డులను తీసుకొచ్చింది. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ఫీజుల వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Card Travel Credit Cards 2024 : మీరు తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్​. ఎస్‌బీఐ కార్డు ఇటీవలే విమాన ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 3 ట్రావెల్​ క్రెడిట్‌ కార్డులను తీసుకొచ్చింది. వీటిల్లో ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌, మైల్స్‌ ఎలైట్‌, మైల్స్‌ ప్రైమ్‌ అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిపై లభించే ట్రావెల్‌ క్రెడిట్లతో మీరు ఎయిర్‌ మైల్స్‌, హోటల్‌ పాయింట్లు, రివార్డులు, లాంజ్‌ యాక్సెస్‌ పొందవచ్చు.

వాస్తవానికి ఎస్‌బీఐ కార్డు మొత్తంగా 20 విమానయాన సంస్థలు, హోటల్‌ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటి ద్వారా విమాన ప్రయాణికులకు అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ - బెనిఫిట్స్​
SBI Card MILES - Benefits & Features :

  • యూజర్లకు వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద రూ.1,500 ట్రావెల్‌ క్రెడిట్స్​ అందిస్తారు.
  • ప్రయాణంలపై చేసే ప్రతి రూ.200 ఖర్చుపై 2 ట్రావెల్ క్రెడిట్స్​, ఇతర వ్యయాలపై 1 ట్రావెల్‌ క్రెడిట్​ లభిస్తాయి.
  • ప్రతి లక్ష రూపాయల వ్యయంపై ఒక అదనపు దేశీయ లాంజ్‌ యాక్సెస్‌ పొందవచ్చు.
  • ఒక సంవత్సరంలో రూ.5 లక్షలు ఖర్చు చేస్తే, 5000 బోనస్‌ ట్రావెల్‌ క్రెడిట్స్​ లభిస్తాయి.
  • ఒక సంవత్సరంలో చేసిన ఖర్చు రూ.6 లక్షలు దాటితే వార్షిక ఫీజు వాపస్‌ ఇస్తారు.
  • ప్రతి ఏడాది నాలుగు డొమెస్టిక్‌ లాంజ్‌లను యాక్సెస్‌ చేయవచ్చు.
  • ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌తో 1000కి పైగా అంతర్జాతీయ లాంజ్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు.
  • కార్డును విదేశాల్లో వినియోగిస్తే 3% మాత్రమే ఫారెన్‌ కరెన్సీ మార్కప్‌ ఛార్జ్‌ ఉంటుంది.
  • అన్ని పెట్రోల్‌ పంపుల్లో 1% ఇంధన సర్‌ ఛార్జీ రాయితీ లభిస్తుంది.
  • కార్డ్​ వార్షిక ఫీజు కింద రూ.1,499 + జీఎస్‌టీ చెల్లించాలి.

ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ప్రైమ్‌ - బెనిఫిట్స్​
SBI Card Miles Prime Features & Benefits :

  • వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద యూజర్లకు రూ.3,000 ట్రావెల్‌ క్రెడిట్స్ అందిస్తారు.
  • ప్రయాణాలపై చేసే ప్రతి రూ.200 ఖర్చుకు 4 ట్రావెల్ క్రెడిట్స్​, ఇతర వ్యయాలపై 2 ట్రావెల్‌ క్రెడిట్స్​ లభిస్తాయి.
  • ప్రతి లక్ష రూపాయల వ్యయంపై ఒక అదనపు దేశీయ లాంజ్‌ యాక్సెస్‌ పొందవచ్చు.
  • ఒక ఏడాదిలో రూ.8 లక్షలు ఖర్చు చేస్తే 10,000 బోనస్‌ ట్రావెల్‌ క్రెడిట్లు లభిస్తాయి.
  • ఒక సంవత్సరంలో చేసిన ఖర్చు రూ.10 లక్షలు దాటితే వార్షిక ఫీజు వాపస్‌ ఇస్తారు.
  • ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌తో 1000కి పైగా అంతర్జాతీయ లాంజ్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు.
  • ప్రతి ఏడాది 8 డొమెస్టిక్‌ లాంజ్‌ యాక్సెస్‌ లభిస్తాయి.
  • కార్డును విదేశాల్లో వినియోగిస్తే 2.50% మాత్రమే ఫారెన్‌ కరెన్సీ మార్కప్‌ ఛార్జ్‌ ఉంటుంది.
  • అన్ని పెట్రోల్‌ పంపుల్లో 1% ఇంధన సర్‌ ఛార్జీ రాయితీ పొందవచ్చు.
  • విమానాల రద్దు, ఎయిర్‌ యాక్సిడెంట్‌లు జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది.
  • కార్డ్​ వార్షిక ఫీజుగా రూ.2,999 + జీఎస్‌టీ చెల్లించాలి.

ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ఎలైట్‌ - బెనిఫిట్స్​
SBI Card Miles Elite Features & Benefits :

  • యూజర్లకు వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద రూ.5,000 ట్రావెల్‌ క్రెడిట్స్ ఇస్తారు.
  • ప్రయాణాలపై చేసే ప్రతి రూ.200 ఖర్చుకు 6 క్రెడిట్స్​, ఇతర వ్యయాలపై 2 ట్రావెల్‌ క్రెడిట్స్ అందిస్తారు.
  • ప్రతి లక్ష రూపాయల వ్యయంపై ఒక అదనపు దేశీయ లాంజ్‌ యాక్సెస్‌ పొందవచ్చు.
  • ఏడాదిలో రూ.12 లక్షలు ఖర్చు చేస్తే 20,000 బోనస్‌ ట్రావెల్‌ క్రెడిట్లు లభిస్తాయి.
  • ఏడాదిలో చేసిన ఖర్చు రూ.15 లక్షలు దాటితే వార్షిక ఫీజు వాపస్‌ ఇస్తారు.
  • ప్రయారిటీ పాస్‌ మెంబర్‌షిప్‌తో 1000కి పైగా అంతర్జాతీయ లాంజ్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు.
  • ప్రతి ఏడాదిలో 8 డొమెస్టిక్‌ లాంజ్​లను యాక్సెస్‌ చేయవచ్చు.
  • విదేశాల్లో వినియోగిస్తే 1.99% మాత్రమే ఫారెన్‌ కరెన్సీ మార్కప్‌ ఛార్జ్‌ ఉంటుంది.
  • అన్ని పెట్రోల్‌ పంపుల్లో 1% ఇంధన సర్‌ ఛార్జీ రాయితీ లభిస్తుంది.
  • విమానాల రద్దు, ఎయిర్‌ యాక్సిడెంట్‌లు జరిగితే పరిహారం అందిస్తారు.
  • కార్డ్ వార్షిక ఫీజు కింద రూ.4,999 + జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ - మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే! - New Bank Rules From May 1st 2024

సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనాలా? ఈ లాభ, నష్టాల గురించి తెలుసుకోండి! - Second Hand Luxury Car Buying Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.