ETV Bharat / business

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ - మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే! - New Bank Rules From May 1st 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 4:07 PM IST

Bank rules in India 2024
Financial Changes From May 1st, 2024

New Bank Rules From May 1st 2024 : మీరు ఐసీఐసీఐ బ్యాంక్​, యెస్ బ్యాంకు, ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంకు కస్టమర్లా? అయితే మీకొక ముఖ్య గమనిక. ఈ బ్యాంకులు తమ బ్యాంకింగ్ సర్వీస్​ ఛార్జీలను పెంచాయి. పెరిగిన ఈ అదనపు ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

New Bank Rules From May 1st 2024 : దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలతో పాటు, క్రెడిట్ కార్డ్ నియమాల్లోనూ పలు మార్పులు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్​, యెస్ బ్యాంకు, ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయి. సవరించిన ఛార్జీలు మే 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఏయే సేవల ఛార్జీలు మారాయో బ్యాంకుల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం.

HDFC Bank Senior Citizen Special FD Scheme : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు సీనియర్ సిటిజన్ల కోసం 2020 మేలో ఒక 'స్పెషల్​ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం'ను ప్రవేశపెట్టింది. దీనిపై వయోవృద్ధులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ ఎఫ్​డీ స్కీమ్​కు మంచి ఆదరణ వస్తుండడం వల్ల, ఈ పొదుపు పథకం గడువును 2024 మే 10 వరకు పెంచింది.

ICICI Bank savings account charges : ఐసీఐసీఐ బ్యాంకు 2024 మే 1 నుంచి వివిధ సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చెక్ బుక్ జారీ, IMPS ట్రాన్స్​ఫర్స్​, ఈసీఎస్/ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్‌లు, స్టాప్​ పేమెంట్ ఛార్జీలను పెంచింది. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఐసీఐసీఐ బ్యాంక్ పొదుపు ఖాతా ఛార్జీలు :

  • డెబిట్ కార్డ్ వార్షిక రుసుము : ఏడాదికి రూ.200; గ్రామీణ ప్రాంతాల్లో రూ.99 మాత్రమే.
  • చెక్ బుక్స్ : ప్రతి సంవత్సరం మొదటి 25 చెక్ లీవ్స్ పూర్తిగా​ ఉచితం. ఆ తర్వాత ఒక్కో చెక్​పై రూ.4 చొప్పువ వసూలు చేస్తారు.
  • డీడీ/ పీఓ - కాన్సిలేషన్​/ డూప్లికేట్/ రీవాలిడేషన్ ఛార్జ్​ : రూ.100
  • IMPS విధానంలో డబ్బులు పంపిస్తే
  1. రూ.1,000 వరకు ఒక్కో లావాదేవీకి రూ.2.50;
  2. రూ.1,000 నుంచి రూ.25,000 వరకు ప్రతి లావాదేవీకి రూ.5;
  3. రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు ఒక్కో లావాదేవీకి రూ.15 చొప్పున ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తారు.
  • ఖాతా మూసివేత : ఛార్జీ లేదు.
  • డెబిట్ కార్డ్ పిన్ రీజెనరేషన్ : ఛార్జీ లేదు.
  • డెబిట్ కార్డ్ డి-హాట్‌లిస్టింగ్ : ఛార్జీ లేదు.
  • బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్ : ఛార్జీ లేదు.
  • పాత లావాదేవీల పత్రాల పునరుద్ధరణ / పాత రికార్డులకు సంబంధించిన విచారణలు: ఛార్జీ లేదు.
  • సంతకం ధ్రువీకరణ : రూ.100.
  • చిరునామా నిర్ధారణ : ఛార్జీ లేదు.
  • ఈసీఎస్ /ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్ : రూ.500
  • నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) మ్యాండేట్​. వన్-టైమ్ మ్యాండేట్ ఆథరైజేషన్ ఛార్జీలు (ఫిజికల్) : ఛార్జీ లేదు.
  • పొదుపు ఖాతా తాత్కాలిక హక్కు మార్కింగ్, అన్‌మార్కింగ్ : ఛార్జీ లేదు.
  • ఇంటర్నెట్ యూజర్ ఐడీ లేదా పాస్‌వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) మళ్లీ జారీ చేయడం: ఛార్జీ లేదు.
  • బ్యాంక్​ శాఖల వద్ద చిరునామా మార్పు అభ్యర్థన : ఛార్జీ లేదు.
  • స్టాప్ పేమెంట్ ఛార్జెస్​ : రూ.100 (కస్టమర్ కేర్ IVR & నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉచితం).

Yes Bank Savings Account Charges From May 1, 2024 : యెస్ బ్యాంక్ కూడా తమ పొదుపు ఖాతాల ఛార్జీలను సవరించింది. అలాగే కొన్ని రకాల ఖాతాలను పూర్తిగా నిలిపివేసింది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. కనీస బ్యాలెన్స్ రిక్వైర్​మెంట్​ (AMB) :

  • సేవింగ్స్ అకౌంట్​ ప్రో మ్యాక్స్ : మినిమం బ్యాలెన్స్​ రూ.50,000. ఛార్జీ గరిష్ఠంగా రూ.1,000 ఉంటుంది.
  • సేవింగ్స్ అకౌంట్​ ప్రో ప్లస్ / యెస్ ఎసెన్స్ ఎస్ఏ/ యెస్ రెస్పెక్ట్ ఎస్ఏ : మినిమం బ్యాలెన్స్​ రూ.25,000. ఛార్జీ గరిష్ఠంగా రూ.750.
  • సేవింగ్స్ అకౌంట్​ ప్రో : మినిమం బ్యాలెన్స్​ రూ.10,000. గరిష్ఠ ఛార్జీ రూ.750
  • పొదుపు విలువ / కిసాన్ ఎస్ఏ : రూ.5,000; ఛార్జీ గరిష్ఠంగా రూ.500
  • మై ఫస్ట్ యెస్ : రూ.2,500; గరిష్ఠ ఛార్జీ రూ.250

2. ఏటీఏం కమ్ డెబిట్​కార్డ్ ఫీజు :

  • ఎలిమెంట్ డెబిట్​కార్డ్ : సంవత్సరానికి రూ.299
  • ఎంగేజ్ డెబిట్​కార్డ్​ : సంవత్సరానికి రూ.399
  • ఎక్స్​ప్లోర్​ డెబిట్​కార్డ్​ : సంవత్సరానికి రూ.599
  • రూపే డెబిట్ కార్డ్ (కిసాన్ ఖాతా కోసం) : సంవత్సరానికి రూ.149

3. ఇతర బ్యాంకుల ఏటీఎం ఉపయోగిస్తే

  • ఒక నెలలో మొదటి 5 లావాదేవీలు పూర్తిగా ఉచితం
  • తదుపరి ఆర్థిక లావాదేవీలు ఒక్కొక్కదానికి రూ.21
  • ఆర్థికేతర లావాదేవీలు ఒక్కొక్కదానికి రూ.10.

Changes in Yes Bank credit card rules : యెస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్​లో పలు మార్పులు చేసింది. కనుక 2024 మే 1 నుంచి గ్యాస్, విద్యుత్, ఇతర యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే 1 శాతం వరకు ఛార్జ్ విధిస్తారు. ఒకే స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ.15,000 కంటే ఎక్కువ విలువైన బిల్లులు చెల్లించడానికి యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించినట్లయితే, జీఎస్జీ సహా అదనంగా 1 శాతం పన్ను వసూలు చేస్తారు. అయితే, యెస్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్‌తో చేసిన పేమెంట్లపై ఈ అదనపు ఛార్జీలు ఉండవు.

IDFC First Bank Credit Card Rule Change : ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్ క్రెడిట్​ కార్డుతో రూ.20,000కు మించి యుటిలిటీ బిల్లులు (గ్యాస్​, విద్యుత్​, ఇంటర్నెట్​ బిల్లులు) చెల్లిస్తే, 18 శాతం జీఎస్టీ సహా 1శాతం రుసుమును వసూలు చేస్తారు. అయితే ఈ అదనపు ఛార్జీ ఫస్ట్ ప్రైవేట్​ క్రెడిట్​ కార్డ్​, ఎల్​ఐసీ క్లాసిక్​ క్రెడిట్​ కార్డ్​, ఎల్ఐసీ సెలెక్ట్ క్రెడిట్​ కార్డులకు వర్తించదు.

మీ పాన్​ కార్డ్​ పోయిందా? డోంట్​ వర్రీ - ఈజీగా డౌన్​లోడ్ చేసుకోండిలా! - How To Download ePAN Card

త్వరలో అమెజాన్ 'గ్రేట్ సమ్మర్ సేల్'​ - ఫోన్స్​, గ్యాడ్జెట్స్​పై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్! - Amazon Great Summer Sale 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.