తెలంగాణ

telangana

రెండేళ్లకే రికార్డు.. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పేస్తున్న బుడతడు

By

Published : Jul 20, 2023, 1:49 PM IST

రెండేళ్ల వయసులో అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ బాలుడు. పది నిమిషాల్లోనే 98 ప్రాంతాల పేర్లు ఔరా అనిపిస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన ప్రతిభతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు సంపాదించాడు. మరి ఆ బాలుడి కథేంటో తెలుసుకుందామా?

west bengal durgapur kid Abhimanyu
west bengal durgapur kid Abhimanyu

రెండేళ్లకే రికార్డు.. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పేస్తున్న బుడతడు

చిన్నపిల్లలు వచ్చీరాని మాటలు మాట్లాడతుంటే విని మురిసిపోతాం... అలాంటిది ఆ మాటలతో రికార్డులు సృష్టిస్తుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కాదా! అలాంటి సంతోషాన్నే ఆస్వాదిస్తున్నారు అభిమన్యు నంది తల్లిదండ్రులు. బంగాల్​కు చెందిన ఈ రెండేళ్ల పిల్లాడు.. తన ముద్దు ముద్దు మాటలతో ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో పేరు సంపాదించాడు. స్కూలులో అడుగు పెట్టకముందే మెడల్స్ అందుకున్నాడు.

అభిమన్యు నంది

దుర్గాపుర్​కు చెందిన సంజయ్ నంది, సుశ్మిత నంది కుమారుడు అభిమ్యను నంది. వయస్సు రెండు సంవత్సరాలే కానీ.. అతడికి ఉన్న ప్రతిభను చూస్తే మాత్రం ఆరో, ఏడో తరగతో చదివే పిల్లాడని అనుకుంటాం. తన ముద్దుముద్దు మాటలతో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్తున్నాడు అభిమన్యు. పది నిమిషాల్లోనే 98 నగరాల పేర్లు, వివిధ జాతీయ చిహ్నలను గుర్తిస్తున్నాడు.

తల్లిదండ్రులతో అభిమన్యు

అభిమన్యుకు ఉన్న ఈ ప్రత్యేకమైన ప్రతిభే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో అతడి పేరు నమోదు అయ్యేలా చేసింది. ఇండియా బుక్ ప్రతినిధులు.. రికార్డు సర్టిఫికెట్, మెడల్​ను పోస్టు ద్వారా ఇంటికి పంపించారు. వాటిని చూడగానే ఇంత చిన్న వయస్సులో ఈ రికార్డును సాధించినందుకు అభిమన్యు తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. అభిమాన్యు తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. పిల్లాడికి మాట్లాడటం వచ్చిన దగ్గర నుంచి సుశ్మిత కష్టమైన పదాలను నేర్పించటం ప్రారంభించింది. కొత్తకొత్త విషయాలన్నీ ఆటల ద్వారా నేర్పించేది. అందుకే అభిమన్యు అన్నింటిని సులభంగా గుర్తుపెట్టుకుంటున్నాడని అతడి తల్లి చెబుతోంది.

తల్లి చెప్పినవి వింటున్న అభిమన్యు

ఫ్యూచర్ జీనియస్!
స్కూలుకు వెళ్లకముందే రాజధానులు, నగరాల పేర్లు చెప్పేస్తున్న అభిమన్యు... స్థానికంగా స్మార్ట్​ కిడ్​గా పేరు తెచ్చుకుంటున్నాడు. భవిష్యత్​లో అతడు జీనియస్​గా మారతాడని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అభిమన్యు ఈ వయసులో రికార్డుల ప్రాముఖత్యను అర్థం చేసుకోలేకపోయినా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింత రాటుదేలుతాడని అంటున్నారు.

తన మెడల్​తో అభిమన్యు నంది

చూడకుండానే సైకిల్ రైడ్..
ఇటీవల కళ్లకు గంతలు కట్టుకొని సైకిల్ రైడ్ చేస్తున్న ఓ పద్నాలుగేళ్ల బాలిక తెగ వైరల్ అయింది. కళ్లకు గంతలు కట్టుకొనే.. కరెన్సీల నోట్లు, దుస్తుల రంగులు గుర్తుపడుతోంది. ఇలా వినూత్న ప్రతిభతో మిరాకిల్ కిడ్​గా పేరు తెచ్చుకుంది. మరి ఆ కిడ్ కథేంటో పూర్తిగా తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details