క్యూట్​ డ్యాన్స్​తో అదరగొడుతున్న చిన్నారి.. సోషల్​ మీడియాలో లక్షకుపైగా ఫాలోవర్స్

By

Published : Jun 30, 2023, 2:13 PM IST

thumbnail

Viral Kid Dance : తన ముద్దులొలికే డ్యాన్స్​లతో అదరగొడుతోంది ఓ చిన్నారి. వివిధ వేషధారణల్లో డ్యాన్స్​లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె వీడియోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. దీంతో ఇన్​స్టాగ్రామ్​లో లక్ష మందికి పైగా ఫాలోవర్లను సంపాదించింది ఈ చిట్టి డ్యాన్సర్​. ఆమెనే మహారాష్ట్రలోని అహ్మద్​నగర్ జిల్లా శిర్డీకి చెందిన రెండేళ్ల చిన్నారి స్వర.

ఇదీ జరిగింది.. శిర్డీలోని సాయినాథ్ సెకండరీ స్కూల్ రిటైర్డ్ టీచర్ కిషోర్ కదమ్ రెండేళ్ల మనవరాలు స్వర. కిషోర్​ కదమ్​ ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు అబ్బాయిలకు, అమ్మాయిలకు డ్యాన్స్​ నేర్పించేవారు. శిర్డీ సంస్థాన్​లో జరిగే ముఖ్యమైన పండుగలకు చిన్న పిల్లలతో రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, రాధగా వేషాలు వేయించి.. డ్యాన్స్ చేయించేవారు. అలాగే తన మనవరాలికి కూడా వివిధ వేషధారణతో డ్యాన్స్​ చేయించారు. చిన్నారి తన చిట్టి చిట్టి పాదాలతో చేసే డ్యాన్స్​ను వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. అయితే, చాలా మంది తమ పిల్లల వీడియోలు సోషల్​ మీడియాలో పెడుతున్నా.. స్వర వీడియోలు మాత్రం వైరల్ ​అయ్యాయని ఆమె తల్లి చెప్పింది. అన్ని సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లలో స్వర కనిపిస్తోందని.. అది తమకు ఆనందాన్ని కలిగిస్తోందని ఆమె తెలిపింది. ప్రస్తుతం స్వరాకు ఇన్​స్టాగ్రామ్​లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 
Ashadi Ekadashi 2023 Marathi : ఆషాది ఏకాదశి కోసం పాండురంగగా దుస్తులు ధరించి స్వర చేసిన డ్యాన్స్​ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.