తెలంగాణ

telangana

తొలిదశ పోలింగ్​కు 'యూపీ' సిద్ధం- ఆ వర్గం తీర్పే కీలకం!

By

Published : Feb 9, 2022, 6:07 PM IST

Updated : Feb 9, 2022, 8:32 PM IST

UP Assembly Elections 2022: ఉత్తర్​ప్రదేశ్​లో తొలిదశ పోలింగ్​కు రంగం సిద్ధమైంది. యూపీ మహాసంగ్రామంలో 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.

UP assembly elections 2022
యూపీ అసెంబ్లీ ఎన్నికలు

UP Assembly Elections 2022: ఉత్తర్​ప్రదేశ్​లో తొలిదశ పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో భాగంగా 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఫిబ్రవరి 10(గురువారం)న ఓటింగ్ జరగనుంది. 2.27కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

కరోనా వేళ..

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం​ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. 11 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద 50 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది.

.

జాట్​లే అధికం..

తొలిదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో జాట్​ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. తొలి దశ ఎన్నికలు జరిగే ఈ జిల్లాల్లోనే రైతులు ఉద్యమాన్ని చేపట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దీంతో ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

తొలి దశలో ఎన్నికలు జరిగే 58 అసెంబ్లీ స్థానాల్లో 53 స్థానాలను 2017 ఎన్నికల్లో కైవసం చేసుకుంది భాజపా.

Last Updated :Feb 9, 2022, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details