తెలంగాణ

telangana

Telangana Liquor Tender 2023 : ఒకే సంస్థ.. 5 వేల దరఖాస్తులు.. తెలంగాణలో వైన్సులు దక్కించుకునేందురు ఏకంగా రూ.100 కోట్లు వెచ్చించిన ఏపీ స్థిరాస్తి సంస్థ

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 9:44 AM IST

Telangana Liquor Tender 2023 : తెలంగాణలో మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఎక్సైజ్‌ టెండర్ల చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ స్థిరాస్తి సంస్థ దరఖాస్తుల రుసుం రూపంలోనే రూ.100 కోట్లు చెల్లించడం ఆబ్కారీ శాఖ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా 5 వేల దరఖాస్తులు చేసినట్లు ఎక్సైజ్​శాఖ పరిశీలనలో తేలింది.

Telangana Liquor Tenders Applications Income
Huge Applications for Liquor Tenders

Telangana Liquor Tender 2023 ఒకే సంస్థ 5 వేల దరఖాస్తులు రూ.100 కోట్ల రుసుం చివరకు ఎన్ని దుకాణాలు దక్కాయో తెలుసా

Telangana Liquor Tender 2023 : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ స్థిరాస్తి సంస్థ.. తెలంగాణలో మద్యం వ్యాపారాన్ని లోతుగా పరిశీలించాక హైదరాబాద్‌ శివారు ప్రాంతాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా శంషాబాద్, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ జిల్లాల పరిధిలో మద్యం విక్రయానికి బాగా గిరాకీ ఉండటంతో.. ఆ ప్రాంతాల్లోని పలు దుకాణాలను దక్కించుకునేందుకు దాదాపు 5 వేల దరఖాస్తులు చేసింది. ఈ క్రమంలో ఆ సంస్థకు లక్కీ డ్రాలో 110కు పైగా దుకాణాలు దక్కినట్లు తెలుస్తోంది.

మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియలో క్రితంసారి 68,691 దరఖాస్తులు రాగా.. ఈసారి లక్షా 31వేల 490 వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున రుసుం చెల్లించటంతో ఖజానాకు రూ.2 వేల 629 కోట్లు చేరింది. ఆ వ్యాపారంలో అనుభవం లేకున్నా.. దుకాణాలు దక్కించునేందుకు యత్నించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. వ్యాపారం గురించి అవగాహన లేకున్నా పలువురు ప్రైవేట్‌ ఉద్యోగులు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

Huge Applications for Liquor Shops in Telangana : సాఫ్ట్​వేర్​, ఫార్మా, స్థిరాస్తి రంగాలకు చెందినవారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. లక్కీడ్రాలో లైసెన్స్‌ మంజూరైతే భారీగా ‘గుడ్‌విల్‌’ ఇచ్చి కొనేందుకు మద్యం వ్యాపారులు సిద్ధంగా ఉన్నారనే ప్రచారంతో పలువురు ఆసక్తి చూపారు. ఆయా చోట్ల జరిగే వ్యాపారాన్ని బట్టి ఒక్కో లైసెన్సుకు రూ.20 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వచ్చే అవకాశముందనే ఉద్దేశంతో వారు దరఖాస్తు చేశారు.

గుడ్‌విల్‌పై ఆశతో ప్రైవేట్‌ ఉద్యోగులు వేసిన దరఖాస్తులే 30 వేల వరకు ఉంటాయని అంచనా. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రూ.10 లక్షల రుణం తీసుకొని ఐదు దరఖాస్తులు వేశారు. లక్కీ డ్రాలో ఒక్కటి తగిలినా రూ.50 లక్షలు వస్తాయని... ఒకవేళ రాకపోతే ఈఎంఐ కట్టుకుంటానని ధీమాగా చెప్పినట్లు ఎక్సైజ్‌శాఖకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు.

Liqour Business in Telangana :తెలంగాణలో మద్యం వ్యాపారం.. ఇతర రాష్ట్రాల వ్యాపారులను ఆకర్షించింది. శేరిలింగంపల్లిలోని ఓ దుకాణంలో.. గతేడాది ఏకంగా రూ.80 కోట్ల వరకు వ్యాపారం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతి దుకాణంలో సగటున రూ.20 కోట్లకుపైగా విక్రయాలు జరుగుతాయి. వ్యాపారులకు సగటున 20 శాతం మార్జిన్‌ వస్తుండటంతో.. ఈసారి పోటీ పెరిగింది. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వ్యాపారులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల ప్రాంతంలోని దుకాణాల కోసం ఆసక్తి చూపారు. గ్రూపుగా ఏర్పడి దాదాపు 800 దరఖాస్తులు సమర్పించారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులు కొత్తగూడెం ప్రాంతంలో దుకాణాల కోసం పోటీపడ్డారు. అక్కడ ఓ కీలక నేత తనయుడిని మచ్చిక చేసుకుంటే చాలు.. నిబంధనలతో సంబంధం లేకుండా భారీగా సంపాదించవచ్చన్న అభిప్రాయంతో పోటీ పెరిగినట్లు తెలుస్తోంది. నెల్లూరుకు చెందిన కొందరు వ్యాపారులు.. మంచిర్యాల ప్రాంతంలోని దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తు చేశారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా... ఎన్ని దరఖాస్తులనైనా సమర్పించేందుకు అవకాశం ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మొగ్గుచూపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పలువురు అక్కడి చిరునామాలతో దరఖాస్తు సమర్పించినట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు.

TS high court on liquor tenders: 'మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు'

ABOUT THE AUTHOR

...view details