ETV Bharat / state

Wine Shop Tender Last Date Telangana : లిక్కర్​ షాప్ టెండర్ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్.. టార్గెట్ రీచ్ అయ్యేనా..?

author img

By

Published : Aug 17, 2023, 1:30 PM IST

Updated : Aug 18, 2023, 9:22 AM IST

Wine Shop Tender Last Date Telangana 2023 : తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్​ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. నేటితో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చూడాలని అబ్కారీ శాఖపై సర్కార్ ఒత్తిడి పెరుగుతోంది. లక్ష దరఖాస్తులు వచ్చేట్లు అధికారులు చొరవ చూపాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తూ.. తక్కువ అర్జీలు వస్తున్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపింది. ఈ ఒక్కరోజు గడువు ఉండటంతో క్షేత్రస్థాయిలో సిండికేట్లు జరగకుండా నిఘా పెట్టాలని జిల్లాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లను అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.

TS Liquor Licence Applications
TS Liquor Licence Applications 2023

Wine Shop Tender Last Date Telangana 2023 : తెలంగాణలో మద్యం వ్యాపారం లాభాల పంటగా భావిస్తుంటారు. అందుకే.. ఏటికేడు ఈ వ్యాపారం వైపు చొరవ చూపేవారి సంఖ్య పెరుగుతోంది. 2021లో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి 68 వేలకుపైగా పోటీ పడ్డారు. దరఖాస్తుకు రూ.2 లక్షల (Liquor License) లెక్కన అప్పట్లో రూ.1357 కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే ఈసారి దరఖాస్తుల స్వీకరణ ద్వారా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని అర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటోంది. నాలుగు రోజుల కిందట అర్జీల స్వీకరణ స్థితిగతులపై అబ్కారీశాఖ(Telangana Excise Department) మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

Telangana New Liquor License Applications 2023 : జిల్లాల వారీగా (New Bar License in Telangana 2023) వచ్చిన అర్జీల స్థితిగతులను పరిశీలించిన మంత్రి.. తక్కువగా దరఖాస్తులు వస్తున్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపించాలని, సిండికేట్లు ఏర్పడకుండా నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా బాగా తక్కువ దరఖాస్తులు వస్తున్న నిర్మల్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలకు హైదరాబాద్‌ నుంచి అబ్కారీ శాఖ అధికారులను పంపినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏయే దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వస్తున్నాయి.. గతంలో ఆయా దుకాణాలకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వచ్చాయి, తక్కువ వస్తుంటే.. ఎందుకు తగ్గుతున్నాయి తదితర అంశాలపై స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Telangana Liquor Shops Notification 2023 : తెలంగాణలో మూణ్నెళ్ల ముందే మద్యం టెండర్లు

Liquor Shop tenders in Telangana 2023 : రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఈ నెల 4వ తేదీ నుంచి అర్జీల స్వీకరణ కొనసాగుతోంది. అయితే ఆశించినంతగా దరఖాస్తులు రాకపోవడంతో.. అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గతంలో కంటే దాదాపు 30వేల దరఖాస్తులు అదనంగా వస్తేనే.. రాష్ట్ర ప్రభుత్వం అంచనాల మేరకు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.

బుధవారం ఒక్క రోజునే ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 6,523 దరఖాస్తులు (Liquor License Application 2023) రాష్ట్రంలోని వివిధ అబ్కారీ కార్యాలయాలకు వచ్చినట్లు కమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది. నాలుగో తేదీ నుంచి బుధవారం వరకు మొత్తం 41,652 అర్జీలు అబ్కారీ శాఖకు అందాయి. దరఖాస్తుకు రూ.2 లక్షల లెక్కన ఇప్పటి వరకు అందిన అర్జీలకు వచ్చిన దరఖాస్తు రుసుం మొత్తం రూ.800 కోట్లు దాటింది. భారీ ఎత్తున అర్జీలు వేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చే వ్యాపారులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా అబ్కారీ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Revanth Reddy Allegations on Liquorshop Licence : 'మద్యం దుకాణాలకు ముందే ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు..?'

Liquor License Online Application Telangana 2023 : రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉండగా అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్​నగర్‌ జిల్లాల్లో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సైతం పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యాపారులు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అర్జీలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌-80, సికింద్రాబాద్‌-99, సరూర్‌నగర్‌-134, శంషాబాద్‌-100, మల్కాజ్​గిరి-88, మేడ్చల్‌-114 దుకాణాలు లెక్కన మొత్తం 615 మద్యం దుకాణాలు(Liquor Shops in Telangana) ఉన్నాయి. వీటిని దక్కించు కోడానికి స్థానిక మద్యం వ్యాపారులతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, మధ్యప్రదేశ్‌, చత్తీస్​గఢ్​ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా అర్జీలు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు హైదరాబాద్‌లోనే మకాం వేసి.. లాభదాయకమైన దుకాణాలను ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటున్నారు. గతంలో అక్కడ జరిగిన వ్యాపారం, వచ్చిన లాభాలు తదితర అంశాలు తెలుసుకుని దరఖాస్తులు వేస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.

Wine Shop License Application Last Date Telangana 2023 : దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. వాటన్నింటిని స్క్రూటినీ చేసిన తరువాత.. ప్రభుత్వం నిర్దేశించినట్లు గౌడ్లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం లెక్కన ముందుగా కేటాయిస్తారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్రంలోని 34 అబ్కారీ జిల్లాల పరిధిలో డ్రా విధానంలో దుకాణాలను ఎంపిక చేసే కార్యక్రమం ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. దుకాణాలు ఎంపిక విషయంలో పారదర్శికంగా ఉండేట్లు చూడాలని ఇప్పటి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు.

Liquor Shops Tenders Telangana 2023 : మద్యం దుకాణాలకు మందకొడిగా దరఖాస్తులు.. ఆ మార్క్​ దాటకపోతే మళ్లీ టెండర్​ నోటిఫికేషన్

Liquor Shops Tenders Telangana 2023 : సర్కార్​కు లిక్కర్ దరఖాస్తుల కిక్.. ఈసారి టార్గెట్ @ రూ.2000 కోట్లు

Last Updated :Aug 18, 2023, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.