ETV Bharat / state

Liquor Shops Tenders Telangana 2023 : మద్యం దుకాణాలకు మందకొడిగా దరఖాస్తులు.. ఆ మార్క్​ దాటకపోతే మళ్లీ టెండర్​ నోటిఫికేషన్

author img

By

Published : Aug 14, 2023, 7:25 AM IST

Updated : Aug 14, 2023, 7:37 AM IST

Liquor Shops
Telangana Liquor Shops Tenders 2023

Liquor Shops Tenders Telangana 2023 : మద్యం దుకాణాల కోసం కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ మందకొడిగా ఉంది. 2021తో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తుదారులు పెద్దగా చొరవ చూపడం లేదని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఒక్కో దుకాణానికి 20 కంటే తక్కువ అర్జీలు వచ్చినట్లయితే మళ్లీ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపింది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది.

Liquor Shops Tenders Telangana 2023 : మద్యం దుకాణాలకు మందకొడిగా దరఖాస్తులు.. ఆ మార్క్​ దాటకపోతే మళ్లీ టెండర్​ నోటిఫికేషన్

Liquor Shops Tenders Telangana 2023 : రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం ఈ నెల 4 నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18 వరకు కొనసాగనుంది. ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు(Telangana Liquor Shops Notification 2023)గానూ.. కేవలం 21 వేల 656 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2021లో తొలి ఎనిమిది రోజుల్లోపే.. 30 వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తాయన్న అంచనా తలకిందులై గతంలో కంటే పది వేల దరఖాస్తులు తగ్గాయి. గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున రూ.1,357 కోట్లు రాగా.. ఈసారి రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు.

Liquor Shops Tenders in Telangana : ఇప్పటివరకు వచ్చిన 21,656 దరఖాస్తుల్లో.. 11వ తేదీన ఒక్కరోజే అత్యధికంగా 8 వేల 491 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో బ్కారీ శాఖ(Telangana Liquor Tenders) ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఆశించిన స్థాయిలో అర్జీలు రాని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మద్యం దుకాణానికి కనీసం 20 దరఖాస్తులు రావాల్సిందేనని నిబంధన పెట్టింది. లేదంటే మళ్లీ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు కొందరు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు బాహాటంగా సర్క్యులర్‌లు కూడా ఇస్తున్నారు.

Liquor Shops Tenders Telangana 2023 : సర్కార్​కు లిక్కర్ దరఖాస్తుల కిక్.. ఈసారి టార్గెట్ @ రూ.2000 కోట్లు

Telangana Liquor Tender Notification 2023 : తాజాగా ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌(Srinivas Goud on Liquor Tenders) ఇదే అంశంపై అధికారులతో సమీక్షించారు. పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. అదేవిధంగా దరఖాస్తుల సంఖ్యను పెంచేందుకు వివిధ వర్గాలతో సమావేశమై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. ఆబ్కారీ జిల్లాల వారీగా తీసుకుంటే ఎక్కడైతే... తక్కువ దరఖాస్తులు వస్తున్నాయో అక్కడికి ప్రత్యేక అధికారిని డిప్యూట్‌ చేయాలని ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌ ముషారఫ్ అలీ ఫరూఖీని మంత్రి ఆదేశించారు.

దరఖాస్తుల్లో ఆ జిల్లాలు టాప్.. ఇవి లాస్ట్..: ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో.. శంషాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో ఉన్న వంద దుకాణాలకు అత్యధికంగా 2,648 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో దుకాణానికి 26కు పైగా అర్జీలు(Liquor Tenders) వచ్చాయి. ఇక నిర్మల్‌, భూపాలపల్లి అబ్కారీ జిల్లాల పరిధిలో ఒక్కో దుకాణానికి రెండు దరఖాస్తులు సైతం రాలేదు. అదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, ఆసిఫాబాద్‌, జనగాం, మెదక్‌ తదితర జిల్లాల్లో దుకాణానికి మూడు నుంచి నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలా తక్కువ దరఖాస్తులు వస్తున్నాయంటే... స్థానిక అధికారులతో మద్యం వ్యాపారులు కుమ్మక్కై సిండికేట్లుగా ఏర్పడుతున్నారని ఆబ్కారీ శాఖ అనుమానిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక అధికారులను ఆయా ప్రాంతాలకు డిప్యూట్‌ చేయాలని నిర్ణయించింది.

Drunken Post Master Nirmal District : మద్యం మత్తులో విధులకు పోస్టుమాస్టర్.. ఆవేదనలో ఖాతాదారులు​

Telangana Govt on Non-tax income : భారీ పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక

Last Updated :Aug 14, 2023, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.