ETV Bharat / state

Revanth Reddy Allegations on Liquorshop Licence : 'మద్యం దుకాణాలకు ముందే ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు..?'

author img

By

Published : Aug 14, 2023, 7:11 PM IST

Updated : Aug 14, 2023, 10:39 PM IST

Revanth Reddy Allegations on Liquorshop Licence : కేసీఆర్​ సొంత మనుషులకు అప్పగించేందుకే మద్యం దుకాణాలకు ముందే టెండర్లు వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్​లో డబుల్ బెడ్​ రూం ఇళ్లు కట్టడానికి స్థలాలు లేవని పేర్కొన్న సీఎం​.. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. గాంధీభవన్​లో మాట్లాడిన ఆయన.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్​ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని సవాల్​ విసిరారు.

Revanth Reddy latest comments
Revanth Reddy fires on KCR

Revanth Reddy Allegations on Liquorshop Licence : తెలంగాణలో జరుగుతున్న అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్​లో చేరిన కొత్త నాయకులను ఆహ్వానిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని గాంధీ భవన్​లో ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన.. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్​ రూ. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకుందన్నారు.

Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'

Revanth on Double Bedroom Houses Delay : హైదరాబాద్​లో డబుల్ బెడ్​ రూం (Double Bedroom Houses) ఇళ్లు నిర్మించడానికి స్థలాలు లేవని పేరొన్న కేసీఆర్​.. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే కేసీఆర్​ ఖాళీ భూములను అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా భూములు కొన్నవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రేవంత్​ సూచించారు. కేసీఆర్​ సొంత మనుషులకు అప్పగించుకునేందుకే వైన్ షాపులకు ముందే టెండర్లు (wine shops Licens process) వేస్తున్నారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. షాపులకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగా.. ముందే టెండర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.

KTR Challenge to Telangana Congress Leaders : 'ఓఆర్ఆర్ అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా'

Licensing process for wine shops : కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే.. వైన్​ షాపులకు మళ్లీ టెండర్లు ప్రక్రియా నిర్వహిస్తామని రేవంత్​ తెలిపారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తమ వాళ్లపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించిన రేవంత్​ రెడ్డి.. పోలీసులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని.. మరో వంద రోజుల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని జోస్యం చేశారు.

Revanth Reddy Challenges KCR : కేసీఆర్​కు తన నాయకత్వంపై నమ్మకముంటే.. వచ్చే శాసన సభ ఎన్నికల్లో గజ్వేల్​ నుంచి పోటీ చేయాలని సవాల్​ విసిరారు. అలాగే జిల్లాలో సిట్టింగ్​ ఎమ్మెల్యేలందరికి సీట్లు ఇవ్వాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని రేవంత్​ అన్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కాంగ్రెస్​ 14కు 14సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అలంపూర్, దేవరకద్రకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్​లో చేరారు.

"కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణను ఇచ్చింది ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని.. ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోవడానికి కాదు. దళితుల భూములు గుంజుకోవాలని కాదు. పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే.. అభివృద్ధి ముసుగులో బీఆర్​ఎస్​ గుంజుకుంటోంది. రూ. 100కోట్లు పలికే భూములను ఎకరానికి కోటి అయినా పేదలకు ఇవ్వాలి కదా. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకొంది. కేసీఆర్​కు తన నాయకత్వంపై నమ్మకముంటే.. వచ్చే శాసన సభ ఎన్నికల్లో గజ్వేల్​ నుంచి పోటీ చేయాలి."- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy Allegations on Liquorshop Licence మద్యం దుకాణాలకు ముందే ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు..

Ex Minister Chandrasekhar Joining in Congress : ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్న మాజీమంత్రి చంద్రశేఖర్‌

Revanthreddy Speech in Lok Sabha : 'ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాల పుస్తకం.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో'

Ministers counter on RevanthReddy Comments : 'రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల కౌంటర్.. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలని హితవు'

Last Updated :Aug 14, 2023, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.