తెలంగాణ

telangana

కరోనా నివారణకు 'చీమల పచ్చడి'.. సుప్రీం ఏమందంటే?

By

Published : Sep 10, 2021, 7:45 AM IST

కరోనా మహమ్మారి(Corona Pandemic) నివారణకు ఉపయోగపడుతున్నప్పటికీ చీమల పచ్చడిని కొవిడ్ చికిత్సలో ఉపయోగించేలా ఆదేశాలు జారీచేయలేమని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. శాస్త్రీయత లేని కారణంగా అలా చేయలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

sc
sc

కరోనా నివారణకు సంప్రదాయ వైద్యమైన ఎర్ర చీమల పచ్చడిని(Ant Chutney) ఉపయోగించాలని సిఫార్సు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎర్రచీమలు, మిరపకాయలతో చేసిన పచ్చడిని జలుబు, దగ్గు, నీరసం, శ్వాస సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారని, కరోనా నివారణకు దీన్ని సిఫార్సు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఒడిశాకు చెందిన గిరిజనుడు నయాధర్‌ పఢియాల్‌ దావా వేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు దీన్ని సంప్రదాయ వైద్యంగా భావిస్తారని తెలిపారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ "చాలా రకాల సంప్రదాయ వైద్యాలు ఉన్నాయి. మన ఇంట్లోనూ(Home Remedies) కొన్నింటిని ఉపయోగిస్తుంటారు. దేశమంతటా దీన్ని అమలు చేయాలని అడగకూడదు" అని న్యాయమూర్తులు జస్టిస్‌ డీ.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పిటిషనర్‌ తొలుత ఒడిశా హైకోర్టులో ఇదే విషయమై దావా వేయగా దీనిపై పరిశీలన జరపాలని శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌), ఆయుష్‌ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. అక్కడ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దావాను కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details