ETV Bharat / bharat

'నీట్​' కేంద్రాల మార్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Sep 9, 2021, 7:00 PM IST

నీట్ పరీక్ష(Neet Exam)​ అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని మార్చుకునేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు(Supreme Court On Neet) కొట్టివేసింది. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలించినందున.. అభ్యర్థులు ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలరని పేర్కొంది.

NEET exam
నీట్ పరీక్షలు

నీట్(Neet Exam)​ అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకునేలా తాము కేంద్రానికి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు(Supreme Court On Neet) తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్ ఎస్​ రవీంద్ర భట్​, జస్టిస్​ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం నీట్​ పీజీ అభ్యర్థులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

2021 జూన్​ నీట్​ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు.. తమ పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే అవకాశం ఉందని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. కానీ, 2021 మార్చి పరీక్షకు అర్హులైన అభ్యర్థులకు మాత్రం ఆ అవకాశం లేదని చెప్పారు. దాంతో వారు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతం దేశంలో అన్ని పనిచేస్తూనే ఉన్నాయని గుర్తుచేసింది. అభ్యర్థులు ఎక్కడికంటే అక్కడికి సులభంగా వెళ్లగలరని చెప్పింది.

"ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు. మీరు ఏ విమానాశ్రయానికి వెళ్లినా విమానంలో సీటు దొరుకుతుంది. ప్రజలు దిల్లీ నుంచి చెన్నైకి వెళ్లగలుగుతున్నారు. దిల్లీ నుంచి కొచ్చికీ వెళ్లగలుగుతున్నారు."

-సుప్రీంకోర్టు

అయితే.. పిటిషన్​దారులు తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోడా.. అభ్యర్థులు దిల్లీ నుంచి కేరళకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. "కేరళ నుంచి దిల్లీకి విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఏప్రిల్,​ మేలో ఉన్నట్లుగా కరోనా ప్రభావం లేదు. కేరళలో కరోనా కేసులు అధికంగానే ఉన్నప్పటికీ.. అక్కడ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి," అని తెలిపింది. పిటిషన్​ను కొట్టివేస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: నీట్​ వాయిదాకు సుప్రీం నో- షెడ్యూల్​ ప్రకారమే పరీక్ష

ఇదీ చూడండి: పీజీ నీట్‌ లేనట్టే..! ఎగ్జిట్‌ పరీక్ష మార్కులే ప్రామాణికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.