తెలంగాణ

telangana

విద్యుత్తు అధికారులపై రైతు 'మిక్సీ' నిరసన.. ఆరు నెలలుగా ఆఫీసులోనే..!

By

Published : May 30, 2022, 11:56 AM IST

Updated : May 30, 2022, 12:41 PM IST

విద్యుత్తు కనెక్షన్​ ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సరికొత్త మార్గంలో నిరసన తెలిపారు ఓ రైతు. విద్యుత్తు కేంద్రంలోనే వంట సామగ్రిని మిక్సీ పట్టుకుంటున్నారు. ఇలా ఒక్క రోజు కాదు.. ఆరు నెలలుగా ప్రతిరోజు చేస్తున్నా అధికారుల్లో చలనం రావటం లేదు. ఈ సంఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది.

Farmer brings mixer grinder to Mescom Office
విద్యుత్తు అధికారులపై రైతు 'మిక్సీ' నిరసన

కొత్తగా నిర్మించుకున్న ఇంటికి విద్యుత్తు కనెక్షన్​ ఇవ్వటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో తన ఇబ్బందులను తెలిపేందుకు ఓ రైతు ఏకంగా విద్యుత్తు కేంద్రానికే మిక్సీని తీసుకెళ్లి మసాలాలు పట్టుకుంటున్నాడు. ఇలా ఒక రోజు కాదు.. ఆరు నెలలుగా ఇలాగే చేస్తున్నా అధికారులు స్పందించటం లేదు. ఈ సంఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగింది. మెస్కామ్​(మంగళూర్​ విద్యుత్తు సరఫరా కంపెనీ లిమిటెడ్​) అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు భద్రావతి తాలూకాలోని మంగూట్​​ గ్రామానికి చెందిన రైతు హనుమంతప్ప.

ఇదీ జరిగింది:మంగూట్​ గ్రామంలో హనుమంతప్ప కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి విద్యుత్తు కనెక్షన్​ ఇవ్వాలని అనావేరిలోని మెస్కామ్​ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అధికారులు పట్టించుకోలేదు. విద్యుత్తు కనెక్షన్​కు డబ్బులు సైతం డిమాండ్​ చేశారు. దానికి హనుమంతప్ప ఒప్పకోకపోవటం వల్ల జాప్యం జరుగుతూ వస్తోంది. వ్యవసాయ మోటార్ల కనెక్షన్(ఐపీ)​ కాకుండా గృహ వినియోగదారుల కనెక్షన్​ ఇవ్వాలని కోరినప్పటికీ.. ఏ ఒక్కరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతు.

విద్యుత్తు కేంద్రంలో రైతు

ఇంట్లో వంట చేసేందుకు ఇబ్బందిగా ఉందని అధికారులకు తెలపగా.. తమ కార్యాలయానికి వచ్చి వంటకు కావాల్సిన మసాలలు, ఇతర సామగ్రిని గ్రైండింగ్​ చేసుకోవాలని సలహా ఇచ్చారు. దాంతో ప్రతి రోజు మిక్సీతో మెస్కామ్​ ఆఫీసుకు వెళ్లి గ్రైండింగ్​ చేసుకుని వస్తున్నారు. హనుమంతప్పకు తల్లి, ఓ సోదరి, భార్యాపిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం వారి ఇంటికి సాధారణ విద్యుత్తు కనెక్షన్​ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామానికి 24/7 నిరంతర జ్యోతి పథకం కింద కొత్త కనెక్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. దీంతో హనుమంతప్ప ఇంటికి ఉన్న విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. కొత్త కనెక్షన్​ ఇవ్వలేదు.

విద్యుత్తు కేంద్రంలో రైతు హనుమంతప్ప

"స్థానిక ఎమ్మెల్యే అశోక నాయక్​ ఇచ్చిన సిఫార్సు లేఖ చూపించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వారి సూచన మేరకే మెస్కామ్​ కార్యాలయానికి వచ్చి మసాలలను గ్రైండింగ్​ చేసుకుంటున్నా. మా ఇంటి నుంచి అర కిలోమీటర్​ దూరం ఉంటుంది. మాకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరిస్తే సమస్య తొలగిపోతుంది. "

- హనుమంతప్ప, రైతు

అధికారులు ఏమన్నారంటే?: హనుమంతప్ప విద్యుత్తు సమస్యపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు అనావేరి మెస్కామ్​ జేఈ విశ్వనాథ్​.' హనుమంతప్ప సమస్య మా దృష్టికి వచ్చింది. గతంలో వారికి ఐపీ ద్వారా పవర్​ కనెక్షన్​ ఇచ్చాం. నిరంతర జ్యోతి ప్రారంభించాకే సమస్య మొదలైంది. కొత్త లైన్​ వేసేందుకు అనుమతులు తీసుకున్నాం. త్వరలోనే పని పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారు. ఐపీ సెట్​ ద్వారా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉంటుంది. రాత్రి వేళల్లోనే సమస్య. ఆయన అనావేరి కార్యాలయానికి రాకుండా.. మల్లాపుర్​కు వెళ్లినట్లు తెలిసింది. మా పరిధిలోని ఏ ఒక్కరిని వదిలేసేది లేదు. సాధ్యమైనంత త్వరగా పవర్​ సప్లై చేస్తాం.' అని తెలిపారు.

ఇదీ చూడండి:ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. మొత్తం 100 మందికి.. ఎలా జరిగింది?

Last Updated : May 30, 2022, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details