ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. మొత్తం 100 మందికి.. ఎలా జరిగింది?

author img

By

Published : May 30, 2022, 6:37 AM IST

HDFC Accounts

HDFC Accounts: 100 మంది హెడ్​ఎఫ్​సీ బ్యాంకు ఖాతాదారులు కోటీశ్వరులుగా మారిపోయారు. ఒక్కొక్కరి అకౌంట్​లో రూ.13 కోట్లు జమ చేసింది బ్యాంకు. ఈ సంఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది. అసలేమైందంటే?

HDFC Accounts: తమిళనాడు చెన్నైలోని టి.నగర్​ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. తమ మొబైల్​ ఫోన్​లకు వచ్చిన మెసేజ్​లు చూసి అవాక్కయ్యారు. తమ ఖాతాలో రూ.13 కోట్లు జమ అయి ఉండడం చూసి షాక్​ అయ్యారు. వారిలో కొంతమంది ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు.

HDFC Accounts
బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్​

ఈ 100 మందికి పైగా ఖాతాదారులకు పొరపాటున నగదు బదిలీ జరిగినట్లు సమాచారం. ఈ ఖాతాలను వెంటనే స్తంభింపజేసిన బ్యాంకు అధికారులు.. సాంకేతిక లోపం వల్ల బదిలీ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బ్యాంకు ఖాతాదారులు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగానికి ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఇంటర్నెట్ సర్వీస్‌ను హ్యాక్ చేసి ఎవరైనా నగదు బదిలీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ తరపున ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సెంట్రల్ క్రిమినల్ విభాగానికి కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

ఇవీ చదవండి: 'కాశీ, మథుర మేల్కొంటున్నాయి.. మనం ముందడుగు వేయాలి'

40రోజుల శిశువు కడుపులో పిండం.. ఆపరేషన్ చేస్తే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.