ETV Bharat / spiritual

జాతకంలో గురుబలం పెరగాలా? అయితే గురువారం ఈ పరిహారం తప్పకుండా చేయండి! - thursday pooja benefits in telugu

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 8:10 PM IST

Thursday Pooja Benefits In Telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుబలం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఒక్క గురు గ్రహ అనుకూలత ఉంటే చాలు ఆ వ్యక్తి జీవితంలో లెక్కలేనన్ని శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. మరి జాతకంలో గురుబలం పెరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ కథనంలో చూద్దాం.

Thursday Pooja Benefits In Telugu
Thursday Pooja Benefits In Telugu

Thursday Pooja Benefits In Telugu : దేవగురువు బృహస్పతి ఆరాధన పరమ పవిత్రమైనదని శాస్త్ర వచనం. ఒక వ్యక్తికి జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, ఆర్ధిక పురోగతి, సొంత ఇల్లు వంటివన్నీ కూడా గురువు అనుకూలత వల్లే కలుగుతాయి. అలాంటి బృహస్పతి అనుగ్రహం పొందాలంటే చేయాల్సిన పూజలు, పాటించాల్సిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం గురుపూజ ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే!
జాతకంలో గురుబలం పెంచుకోడానికి, అదృష్ట యోగం పట్టడానికి గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం, ధ్యానం చేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన చేసే పనుల్లో విజయం లభిస్తుంది.

గురువారం విష్ణు పూజతో కలిసి వచ్చే అదృష్టం
శ్రీ మహావిష్ణువు పూజకు గురువారం ఎంతో శ్రేష్టమైనది. అందుకే శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో గురుగ్రహం అనుకూలత పొందడానికి పసుపు రంగు పూలతో పూజించాలి. శ్రీమన్నారాయణునికి పసుపు రంగులో ఉండే పండ్లు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. పవిత్రమైన మనసుతో 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు సమకూరుతాయి.

స్నానం చేసే నీటిలో ఇది వేస్తే ఐశ్వర్యప్రాప్తి!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీనంగా ఉన్నట్లైతే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు పొందడానికి, జాతక బలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచించిన ఈ పరిహారం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని, ఆనందం, అదృష్టం కలుగుతాయని విశ్వాసం.

గురువారం ఈ చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్యం
శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తారని శాస్త్రం చెబుతోంది. అందుకే గురువారం అరటి చెట్టును పసుపుకుంకుమలతో పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్ర వచనం.

వరాలనిచ్చే గురువారం పూజ
గురువారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని, వ్రత కథ విని ప్రసాదం స్వీకరిస్తే సత్యనారాయణ స్వామి అనుగ్రహించి వెల కట్టలేని వరాలతో ఆశీర్వదిస్తారని గురువులు, పెద్దలు చెబుతారు.

పూజకు మనసే ప్రధానం
మనం ఏ పూజ చేసిన పవిత్రమైన మనసుతో భక్తి శ్రద్ధలతో చేయాలి. భగవంతుని పూజకు భక్తే ప్రధానం. భక్తితో ఏ పూజ చేసిన భగవంతుని అనుగ్రహం మన వెంటే ఉంటుంది. మనమందరం కూడా గురువారం ఈ పరిహారాలు పాటించి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందుదాం.

శుభం భూయాత్

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.