తెలంగాణ

telangana

దీదీ సర్కారుకు షాక్.. రూ.3500కోట్ల జరిమానా.. ఎందుకంటే

By

Published : Sep 4, 2022, 7:15 AM IST

బంగాల్​లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సర్కారుకు షాక్ తగిలింది. ఆ ప్రభుత్వానికిజాతీయ హరిత ట్రైబ్యునల్ రూ.3500 కోట్ల జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణపై బంగాల్‌ సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

BENGAL NGT
BENGAL NGT

బంగాల్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు గానూ రూ.3500 కోట్ల జరిమానా విధించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ వ్యవహారాలకు రూ.12,819కోట్లు ఖర్చు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. మురుగు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు బంగాల్‌ సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ట్రైబ్యునల్‌ అసహనం వ్యక్తం చేసింది.

"దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఆరోగ్య సంబంధిత సమస్యలను వాయిదా వేయలేం. ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడం స్థానిక సంస్థలు, రాష్ట్రాల రాజ్యాంగ బాధ్యత. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిధుల కొరత కోసం ఎదురుచూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలను ఆలస్యం చేయకూడదు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. రెండు నెలల్లోపు రూ.3500కోట్లను బంగాల్‌ ప్రభుత్వం జమ చేయాలి" అని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఏకే గోయెల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఇకనైనా చెత్త నిర్వహణపై బంగాల్‌ సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details