ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపెద్ద పెన్ను.. హైదరాబాద్​ వాసి రికార్డు బద్దలు

author img

By

Published : Sep 3, 2022, 10:51 PM IST

World Biggest Pen : ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్​ పెన్నును తయారు చేశారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. 20 అడుగుల పొడవు, 42 కిలోల బరువు గల ఈ పెన్నులో రికార్డర్​తో పాటు సీసీటీవీ కెమెరాను పెట్టారు.

World Biggest Pen
అతిపెద్ద పెన్ను

World Biggest Pen : సాధారణంగా పెన్నులు అంటే జేబులో పెట్టుకునేలా చిన్నగా ఉంటాయి. కానీ ఈ పెన్ను మాత్రం 20 అడుగుల పొడవు ఉంటుంది. దీంట్లో రికార్డర్​తో పాటు సీసీటీవీ కెమెరా కూడా ఉంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పెన్ను ప్రపంచంలోనే అతిపెద్దది అంటున్నారు రూపకర్త. ఇంత పెన్ను ఎలా రాస్తుంది? బొమ్మ పెన్ను అనుకునేరు.. చక్కగా రాస్తుందటా మరి ఆ పెన్ను కథేంటో చూద్దాం పదండి.

World Biggest Pen
అతిపెద్ద పెన్ను

హిమాచల్​ ప్రదేశ్​ సిర్మౌర్​ జిల్లాకు చెందిన సంజీవ్​ అట్రీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెన్నును తయారు చేశారు. 20 అడుగుల పొడవుతో 42 కిలోల బరువు గల ఈ పెన్నులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో సౌండ్​ రికార్డర్​తో పాటు సీసీటీవీ కెమెరాను కూడా పెట్టారు. ఈ పెన్ను షో పీస్​లా కాకుండా.. ఇంక్​తో ఉందని చెప్పారు. చక్కగా రాస్తుందని వెల్లడించారు. శనివారం ప్రారంభించిన ఈ పెన్నును అట్రీ పాఠశాలలోని విద్యార్థులందరికీ అంకితం ఇస్తున్నట్లు​ పేర్కొన్నారు.

World Biggest Pen
అతిపెద్ద పెన్ను
World Biggest Pen
అతిపెద్ద పెన్ను

గపెన్నులో సౌండ్​ సెన్సార్​ ఉన్నందువల్ల.. ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా పాఠాన్ని రికార్డు చేసి మొబైల్​ నుంచి పంపితే ఈ పెన్ను బోధిస్తుందని వెల్లడించారు. ఈ పెన్నులో ఉన్న సీసీ కెమెరా వల్ల పాఠశాల సెక్యూరిటీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాఠశాలలో ప్రార్థనను పాడుతుందని.. సౌరశక్తితో చార్జ్ చేసుకునే సదుపాయం ఉందని వివరించారు. ఈ పెన్నును చెక్క, ఇనుముతో తయారు చేశానని.. దీనికి రూ. 45,000 ఖర్చు అయ్యిందని చెప్పారు. ఈ పెన్ను తయారీలో మరో ఆరుగురు ఉపాధ్యాయులు సహకారం అందించారని తెలిపారు. అంతకుముందు అతిపెద్ద పెన్ను రికార్డు హైదరాబాద్​కు చెందిన ఆచార్య ముకునూరి శ్రీనివాస పేరిట ఉందని చెప్పారు. 18 అడుగుల పొడవు, 37 కిలోల బరువు గల ఆ పెన్ను గిన్నిస్​ బుక్​ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకుందని తెలిపారు.

World Biggest Pen
అతిపెద్ద పెన్ను

ఇవీ చదవండి: దిల్లీకి నితీశ్​.. ప్రతిపక్షాలను కూడగట్టడమే లక్ష్యంగా విస్తృత పర్యటన

దళిత ఉపాధ్యాయురాలిపై కుల వివక్ష.. అంగన్​వాడీని కాన్వెంట్​లా తీర్చిదిద్ది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.