ETV Bharat / bharat

దళిత ఉపాధ్యాయురాలిపై కుల వివక్ష.. అంగన్​వాడీని కాన్వెంట్​లా తీర్చిదిద్ది..

author img

By

Published : Sep 3, 2022, 5:03 PM IST

Updated : Sep 3, 2022, 7:46 PM IST

కుల వివక్ష చూపుతూ ఓ దళిత ఉపాధ్యాయురాలిని అంగన్​వాడీలోకి అనుమతించలేదు పిల్లల తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని దావణగెరె తాలుకాలో జరిగింది. తనకు జరిగిన అవమానాన్ని సవాల్​గా తీసుకున్న మహిళ.. మరో అంగన్​వాడీని కాన్వెంట్​లా తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.

Dalit teacher barred from teaching
Dalit teacher barred from teaching

దళిత ఉపాధ్యాయురాలిపై కుల వివక్ష.. అంగన్​వాడీని కాన్వెంట్​లా తీర్చిదిద్ది..

దళిత ఉపాధ్యాయురాలు ఉందనే కారణంతో పిల్లలను అంగన్​వాడీకి పంపించలేదు తల్లిదండ్రులు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ ఉపాధ్యాయురాలు.. మరొక ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. తనను అవమానించిన వారికి గుణపాఠం చెప్పేలా.. కొత్తగా చేరిన అంగన్​వాడీని కాన్వెంట్​లా తీర్చిదిద్దారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ ఘటన కర్ణాటక దావణగెరెలో జరిగింది.

Dalit teacher barred from teaching
అంగన్​వాడీ పాఠశాల
Dalit teacher barred from teaching
పిల్లలను ఆడిస్తున్న లక్ష్మీ

లక్ష్మీ అనే దళిత మహిళ హలెచిక్కనహల్లి గ్రామంలో అంగన్​వాడీ టీచర్​గా పనిచేసేవారు. ఆమె దళిత వర్గానికి చెందిన మహిళ కావడం వల్ల.. తమ పిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు కొందరు తల్లిదండ్రులు. పిల్లలను తాకకుండా ఉండాలని సమీపంలోకి కూడా రానిచ్చేవారు కాదు. దళిత మహిళ అనే కారణంతో పాఠశాల ప్రాంగణంలోకి కూడా రావొద్దంటూ ఆమెను వేధించారు. ఇలానే మూడు నెలల పాటు ఆ మహిళను తీవ్ర మానసిక వేదనకు గురిచేశారు. దీంతో చేసేదేమిలేక మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించిన లక్ష్మీ.. సమీపంలోని గోశాలే అంగన్​వాడీ కేంద్రానికి బదిలీ చేయించుకున్నారు.

Dalit teacher barred from teaching
పిల్లలకు ఆహారం తినిపిస్తున్న లక్ష్మీ
Dalit teacher barred from teaching
పిల్లలను ఆడిస్తున్న లక్ష్మీ

తనను అవమానించిన వారికి తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కొత్త బోధనా విధానాన్ని ప్రవేశపెట్టారు. కాన్వెంట్లకు దీటుగా అంగన్​వాడీని తయారుచేయాలని అనుకున్నారు. అందుకోసం అంగన్​వాడీలో చేరిన 30 మంది విద్యార్థులకు కన్నడతో పాటు తెలుగు, ఇంగ్లీషు భాషల స్టడీ మెటీరియల్​తో పాఠాలు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం గోశాలే అంగన్​వాడీకి మారిన లక్ష్మీ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నారు. తమ పిల్లలను సైతం ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఇతర గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో లక్ష్మీ ఉత్తమ అంగన్​వాడీ టీచర్​గా పాపులర్​ అయిపోయారు. కుల వివక్షకు గురవుతున్న అనేక మందికి లక్ష్మీ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు.

Dalit teacher barred from teaching
అంగన్​వాడీ విద్యార్థులు
Karnataka Dalit Anganwadi teacher
అంగన్​వాడీ ఉపాధ్యాయురాలు లక్ష్మీ

ఇవీ చదవండి: వైద్యుడిపై కులవివక్ష!.. వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్.. మేక కోసం తల్లి దారుణ హత్య

కడియాల కోసం దారుణం.. వృద్ధురాలి కాలు నరికి పరార్.. స్కూల్లో దళితులపై కులవివక్ష

Last Updated : Sep 3, 2022, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.