తెలంగాణ

telangana

మరో 'నిర్భయ' ఘటన.. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం..

By

Published : Jun 8, 2022, 12:11 PM IST

Updated : Jun 8, 2022, 1:30 PM IST

Gang Rape In Bus: దిల్లీ తరహా నిర్భయ ఘటన బిహార్​లో జరిగింది. మైనర్​పై బస్సులో అఘాయిత్యానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు, మధ్యప్రదేశ్​లో ఓ బాబాను వివాహం చేసుకున్న.. మహిళ ఆచూకీ కోల్పోయింది. తన కూతురి భర్తే ఆమెను బంధించి ఉంటాడని మహిళ తండ్రి ఆరోపిస్తున్నారు.

Gang Rape In Bettiah
Gang Rape In Bettiah

Gang Rape In Bus: బిహార్ పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో దారుణం జరిగింది. బస్సులోనే ఓ మైనర్​పై లైంగిక దాడి జరిగింది. బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
బస్సు పట్నాకు వెళ్తుందని చెప్పి బాలికను ఎక్కించుకున్నాడు డ్రైవర్. కాసేపటికి కండక్టర్​, హెల్పర్​లను వెంటబెట్టుకొని బస్సును.. బస్టాండ్ నుంచి బయటకు తీశాడు. బైపాస్ రోడ్డు వద్ద బస్సును ఆపి.. ఆ తర్వాత బాలికకు మత్తుపదార్థాలు కలిపిన పానీయాన్ని ఇచ్చాడు. బాలిక స్పృహతప్పి పడిపోగానే.. నిందితులు ఆమెపై బస్సులో సామూహిక అత్యాచారం చేశాడు. అనంతరం బస్సును లాక్ చేసి డ్రైవర్ పారిపోయాడు.

అత్యాచారం జరిగిన బస్సు
.

బాలిక స్పృహలోకి రాగానే బస్సు తలుపులను గట్టిగా కొట్టింది. దారిన వెళ్లేవారు గమనించి డోర్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ ఘటనపై బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. బస్సును సీజ్ చేశారు.

పోలీసులు

బాబాతో పెళ్లి.. ఆ తర్వాత..?
మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో బాబా మోసానికి ఓ మహిళ బాధితురాలిగా మారింది. ఆ బాబాను వివాహం చేసుకున్న మహిళ.. కొద్దిరోజులుగా ఆచూకీ లేకుండా పోయింది. మహిళ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెను వెతికి పెట్టుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

ఏం జరిగిందంటే..?
తాటిపుర్​లో నివసించే మహిళ తండ్రి.. ఆమె వివాహం కోసం న్యూస్​పేపర్​లో ప్రకటన ఇచ్చాడు. దీన్ని చూసి సురేశ్ ప్రసాద్ అనే వ్యక్తి వీరి కుటుంబాన్ని సంప్రదించాడు. ఓంకారేశ్వర్ టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్​గా తనను తాను చెప్పుకున్నాడు. హర్దౌహా మహరాజ్​గా పేరున్న అతడు.. మహిళను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. ఇరువర్గాల అంగీకారంతో సురేశ్​తో మహిళ కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. ఆర్యసమాజ్ మందిరంలో పెళ్లి కానిచ్చారు.

అయితే, వివాహం తర్వాత సురేశ్ ఇంటికి వెళ్లిన మహిళకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అతడికి ఇదివరకే పెళ్లైందని, పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుంది. ఈ విషయంపై ప్రశ్నించేసరికి.. తనపై దాడి చేసేవాడని మహిళ తెలిపింది. ఇంటికి తీసుకెళ్లిపోవాలని ఓరోజు తనను అడిగిందని మహిళ తండ్రి తెలిపారు. అప్పటి నుంచి తన కూతురి జాడ తెలియడం లేదని వాపోయారు. బాబానే తన కూతురిని బంధించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో హల్​చల్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా.. విషం తాగినట్లు అందులో కనిపించింది. తాను ఎంత ప్రేమించినా అర్థం చేసుకోవడం లేదని మహిళతో చెప్తున్నట్లు ఆ వీడియో ఉంది.

ఇదీ చదవండి:

Last Updated : Jun 8, 2022, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details