తెలంగాణ

telangana

రూపాయికే కిలో మామిడి పండ్లు.. సాగు రైతుల కష్టాలు.. ఎక్కడంటే?

By

Published : Jun 13, 2023, 7:53 AM IST

Updated : Jun 13, 2023, 12:11 PM IST

Malda Mango West Bengal : భారత్​లో ప్రసిద్ధ మామిడి రకాల ఉత్పత్తులకు పేరుగాంచిన బంగాల్​లోని మాల్దా జిల్లాకు చెందిన సాగుదారులు, విక్రయదారులు.. వాటి అమ్మకాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి ధరలు పూర్తిగా పడిపోయాయని వాపోతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని చెబుతున్నారు.

malda mango west bengal
malda mango west bengal

Malda Mango Price : దేశంలోనే వివిధ రకాల మామిడి ఉత్పత్తులకు బంగాల్​లోని మాల్దా జిల్లా నిలయం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మామిడి కాయలను, పండ్లను సాగు చేస్తుంటారు ఇక్కడి రైతులు. మాల్దా జిల్లాలో పండించిన మామిడికి దేశ విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంటుంది. చాలా మంది వీటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. ధరలు పూర్తిగా తగ్గిపోయాయని మామిడి ఉత్పత్తిదారులు, విక్రయదారులు చెబుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడికి కూడా ఆదాయం రావటం లేదని వారు వాపోతున్నారు.

మార్కెట్​లో మామిడికి ఆశించినంత డిమాండ్​ లేదని రైతులు చెబుతున్నారు. బిహార్​, అసోంకు తప్ప మరెక్కడికీ మామిడి ఎగుమతి కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షణ్​ భోగ్​ రకం మామిడి పండ్లు కేవలం కిలో 5 రూపాయలకే అమ్ముడుపోతున్నాయని.. విక్రయదారుడు దుల్లి చౌదరి చెప్పాడు. హిమసాగర్​, లాంగ్రా వంటి రకం మామిడి కాయలు రూ.10-15కే అమ్ముడుపోతున్నాయని వెల్లడించాడు. ఈ సారి ధర చాలా తక్కువగా ఉందని చౌదరి తెలిపాడు. మామిడి పండ్లను రూపాయి నుంచి రూ.3కే తోటల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

మార్కెట్​లో మామిడి విక్రయాలు
మార్కెట్​లో మామిడి విక్రయాలు

"లక్ష్మణభోగ్‌, రాఖల్‌భోగ్‌ రూ.5-8కి.. క్షీరపతి (హిమసాగర్‌) కిలో రూ.10-20కి విక్రయిస్తున్నాం. లాంగ్రా మామిడి రకం పండ్లు కూడా ఇదే తరహాలో అమ్ముడుపోతున్నాయి. చాలా రకాల మామిడి పండ్లు మార్కెట్​లో అందుబాటులో ఉన్నప్పటికి ధరలు మాత్రం విపరీతంగా తగ్గిపోయాయి" అని రిటైల్​ మామిడి విక్రయదారుడు షెఫాలీ మండల్ చెబుతున్నాడు.

తోటలోని చెట్లకు మామిడి కాయలు

స్వపన్ పొద్దార్ అనే రైతు స్వయంగా మామిడి పంటను పండిస్తున్నాడు. ఈయన మామిడి కాయలను, పండ్లను హోల్​సేల్​గా అమ్ముతుంటాడు. ఈ సారి మాత్రం మామిడి దిగుబడి ఆశించినట్లుగా రాలేదని స్వపన్​ చెబుతున్నాడు. ధరలు కూడా అదే స్థాయిలో తగ్గిపోయాయని ఆయన తెలిపాడు. తాము ఈ స్థాయిలో ధరలు తగ్గుతాయని అస్సలు ఊహించలేదని చెప్పిన స్వపన్.. పెట్టిన పెట్టుబడికి తగ్గినట్లుగా కూడా ఆదాయం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తోటలోని చెట్లకు మామిడి కాయలు

మరపుకుర్ ప్రాంతానికి చెందిన మరో మామిడి సాగుదారు సందీప్ చౌదరి మాట్లాడుతూ.. ఈ సారి మామిడి కొనేవారు ఎక్కువగా లేరని తెలిపాడు. మామిడి ధర అట్టడుగు స్థాయికి పడిపోయిందని ఆయన పేర్కొన్నాడు. మామిడి కాయలను రూ. 4-5 అమ్ముతున్నామని.. పండ్లు అయితే రూ.1-2కే అమ్ముతున్నామని ఆయన వెల్లడించాడు. ఒకవేళ మామిడి కాయలు చెట్టుకే పండ్లుగా మారితే.. వాటిని అడిగినంత ధరకే ఇవ్వాల్సి ఉంటుందని సందీప్ వివరించాడు.

మార్కెట్​లో మామిడి విక్రయాలు

'ఆవులు కూడా తినవు'
ఈ సీజల్​లో చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తోందని మామిడి రైతులు, విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి పండ్లు బిహార్, అసోంలకు మాత్రమే సరాఫరా అవుతున్నాయని వారు చెబుతున్నారు. మిగిలిపోయిన మామిడితో ఏం చేసుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. మామిడి కాయలను, పండ్లను.. ఆవులు, మేకలు కూడా తినవని వారు చెబుతున్నారు.

Last Updated :Jun 13, 2023, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details