తెలంగాణ

telangana

KP Chowdary Drugs Case : గూగుల్‌ డ్రైవ్‌లో డ్రగ్స్‌ గుట్టు.. కేపీ చౌదరి కాల్ లిస్టులో అషూరెడ్డి..?

By

Published : Jun 24, 2023, 9:08 AM IST

Updated : Jun 24, 2023, 9:22 AM IST

KP Chowdary Drugs Case Updates :టాలీవుడ్‌ను కుదిపేస్తున్న మత్తుదందాలో ప్రముఖుల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. కబాలి తెలుగు సినిమా నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తపోయే విషయాలను పోలీసులు గుర్తించారు. సినీ,రాజకీయ ప్రముఖులు కేపీ చౌదరి దగ్గర డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. రిమాండ్‌ రిపోర్ట్‌లో వారి పేర్లను పోలీసులు పొందుపర్చారు. 12 మంది వెండితెర, బుల్లితెర నటులు, వ్యాపారులు.. కొకైన్‌ కొన్న వారిలో ఉన్నారు.

KP Chowdary Drugs Case
KP Chowdary Drugs Case

కేపీ చౌదరి రిమాండ్‌ రిపోర్ట్‌లో కొన్నవారి జాబితా

KP Chowdary Drugs Case Remand Report :రెండు రోజుల కస్టడీలో భాగంగా కేపీ చౌదరిని విచారించిన పోలీసులు.. అతని ఫోన్​కాల్‌ డేటా, గూగూల్ డ్రైవ్‌ను పరిశీలించి.. పలువురితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో బెజవాడ భరత్, చింతా రాకేశ్‌రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగూర్ విజ్ అలియాస్ ఠాగూర్, ప్రసాద్ మోటూరి, తేజ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శ్రవణ్​రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్, అనూరూప్‌ ఉన్నారు.

వీరంతా బండ్లగూడ జాగీర్‌లోని స్నేహితహిల్స్‌లోని సిక్కీ రెడ్డి నివాసంలో వేడుకలు నిర్వహించుకునేవారు. అక్కడ పార్టీలో మత్తు కోసం కొకైన్ తీసుకునే వారంటూ గూగుల్ డ్రైవ్‌లో పక్కా ఆధారాలు బయటపడ్డాయి. కేపీ చౌదరికి చెందిన నాలుగు ఫోన్లలో వందలాది మంది ప్రముఖుల ఫోన్ నెంబర్లున్నాయి. వీటిలో సుమారు 20 మందితో.. నాలుగైదు నెలల నుంచి వందలాది ఫోన్‌కాల్‌ సంభాషణలు వెలుగు చూశాయి. కేపీ చౌదరి బ్యాంకు ఖాతాల్లో లక్షల్లో లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు.

KP Chowdhary arrested in Drugs Case : ఈ ఏడాది మేలో కేపీ చౌదరి.. తన స్నేహితుడు బెజవాడ భరత్‌తో కలసి బెంగళూరు వెళ్లారు. అక్కడ వారాంతపు పార్టీలో సరదాగా గడిపారు. అక్కడే భారీ ఎత్తున కొకైన్ క్రయ, విక్రయాలపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఏపీలోని భీమవరం నివాసి సురేష్ రాజుతో.. కేపీ చౌదరి ఫోన్ సంభాషణలు నిర్వహించారు. ఆ తరువాత వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన అనురూప్‌తో వందసార్లు ఫోన్‌లో మాట్లాడారు.

పంజాగుట్టకి చెందిన పుష్పక్ క్యాబ్స్ యజమాని రతన్‌ రెడ్డితోనూ ఎక్కువసార్లు మాట్లాడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న.. సినీ నటి ఆషురెడ్డితోనూ ఎక్కువసార్లు మంతనాలు జరిపారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సుధీర్, సినీతార జ్యోతి, అమెరికాలో ఉన్న అమర్‌లతో మాట్లాడాడు. నిర్మాత కేపీ చౌదరి గోవాలోని రెస్టారెంట్ నిర్వాహకుడు మనిష్‌షా బ్యాంకు ఖాతాకు రూ.85,000 పంపాడు.

ఏపీలోని మంగళగిరికి చెందిన షేక్ ఖాజా బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు, బిహార్‌కు చెందిన కౌశిక్ అగర్వాల్ ఖాతాలో రూ.16,000, విజయవాడకు చెందిన సుజాత బ్యాంకు ఖాతాలో రూ.లక్ష లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించారు. నిందితుడి బ్యాంకు ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలు, ఆయా బ్యాంకు ఖాతాదారుల వివరాలను పోలీసులు రాబట్టారు. ఆ బ్యాంకు ఖాతాలు ఎవరు నిర్వహిస్తున్నారు.. ఇతరుల పేర్లతో డ్రగ్స్ పెడ్లర్స్ వినియోగిస్తున్నారా అనే సమాచారం కోరుతూ పోలీసులు ఆయా బ్యాంకులకు మెయిల్ ద్వారా సంప్రదించినట్లు తెలుస్తోంది.

KP Chowdhary arrested in Drugs Case :కేపీ చౌదరి ఫోన్లలో తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందిన నటులు, ఇద్దరు దర్శకుల పేర్లను పోలీసులు గుర్తించారు. వీరిలో ఎంతమందికి డ్రగ్స్ సరఫరా జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. సినిమాల్లో తల్లి పాత్రలు పోషిస్తున్న నటీమణుల్లో ఒకరి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు సంబంధాలున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. వీరంతా డ్రగ్స్ వాడుతున్నారా..? విక్రయిస్తున్నారా..? అనే అంశంపై పూర్తి స్పష్టత వచ్చాక వారికి నోటీసులు జారీ చేయాలనుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 24, 2023, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details