తెలంగాణ

telangana

'విద్యావ్యవస్థలో మార్పులు వారి సూచనల మేరకు జరగాలి'

By

Published : Feb 28, 2021, 12:21 PM IST

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థుల చర్చల నుంచి వచ్చిన విధానాలనే విద్యావ్యవస్థలో పొందుపరుస్తామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. జాతీయ సైన్స్​ దినోత్సవం సందర్భంగా తమిళనాడు, తిరునల్వేలిలోని సెయింట్ ​జేవియర్​ కళాశాల ప్రొఫెసర్లతో సంభాషించారు.

any policy made for the education that comes from conversation from professors and students
'వారి విధానాలనే విద్యావ్యవస్థలో తీసుకువస్తాం'

విద్యావ్యవస్థలో నూతన విధానాలెప్పుడూ..ఉపాధ్యాయులు, విద్యార్థుల సలహాల నుంచే రావాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఈ విధానం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. జాతీయ సైన్స్​ దినోత్సవం సందర్భంగా తమిళనాడు, తిరునల్వేలిలోని సెయింట్ ​జేవియర్​ కళాశాల ప్రొఫెసర్లతో రాహుల్​ సంభాషించారు.

ఆర్థికంగా బలమైనవారికే విద్య అనే విధానాన్ని తాను అంగీకరించనని రాహుల్​ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే విద్యార్థులకు స్కాలర్​షిప్​లను పెంచుతామని అన్నారు.

ఇదీ చదవండి:'దేశానికి వ్యవసాయమే ప్రధాన వ్యాపారం'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details