తెలంగాణ

telangana

సీతపై అలక.. 42 ఏళ్లుగా అన్నం ముట్టని రామచంద్ర.. కేవలం టీ తోనే!

By

Published : Dec 9, 2022, 9:30 PM IST

Updated : Dec 10, 2022, 12:21 PM IST

భార్యపై అలిగి 42 ఏళ్లుగా అన్నం తినడం మానేశాడు ఓ భర్త. కేవలం టీ మాత్రమే తాగి బతుకుతున్నాడు. అసలు ఏం జరిగిందంటే?

husband-stopped-eating-rice-for-42-years-on-angry-with-his-wife
husband-stopped-eating-rice-for-42-years-on-angry-with-his-wife

సీతపై అలక.. 42 ఏళ్లుగా అన్నం ముట్టని రామచంద్ర.. కేవలం టీ తోనే!

భార్యభర్తల మధ్య గొడవలు సహజం. కొన్నిసార్లు భర్తపై భార్య అలగడం, మరికొన్నిసార్లు భార్యపై భర్త అలగడం ప్రతి దంపతుల విషయంలో జరిగేదే. ఒక వేళ ఎప్పుడైనా పెద్ద గొడవ జరిగినా.. కోపం ఓ రెండ్రోజులు ఉంటుంది అంతే. తరువాత మాములే. కానీ ఒడిశాకు చెందిన ఓ భర్త మాత్రం.. తన భార్య మీద 42 ఏళ్లుగా అలిగాడు. అప్పటి నుంచి అన్నం తినడం మానేశాడు. కేవలం ఛాయ్ తాగుతూ, అటుకులు తింటూ జీవిస్తున్నాడు. ఇన్నేళ్లయినా ఇంకా భార్యపై అతడికి కోపం తగ్గలేదు.

ఏం జరిగిందంటే?
జైపుర్ జిల్లాలోని వికీపుర్ గ్రామానికి చెందిన రామచంద్ర(76)కు 22 ఏళ్ల వయసులో సీత అనే మహిళ వివాహం జరిగింది. 42 సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య చిన్నగొడవ జరిగింది. ఓ రోజు రామచంద్ర కూలిపనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. అన్నం పెట్టమని భార్యను అడిగాడు. కానీ ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వంట చేయలేదు. రామచంద్రకు అన్నం పెట్టలేకపోయింది.

అటుకులు తింటున్న రామచంద్ర

అయితే భార్య పరిస్థితిని అర్థం చేసుకోని రామచంద్ర.. తినడానికి అన్నం పెట్టలేదని ఆమెపై అలకపూనాడు. అప్పటి నుంచి కోపంతో అన్నం తినడం మానేశాడు. అలాగని ఆమెతో మాట్లాడటం మానేయలేదు. అన్యోన్యంగానే ఉంటున్నాడు. అన్నం మాత్రం ముట్టుకోవడం లేదు.

అన్నం తినమని ఎంత మంది చెప్పినా వినడం లేదు రామచంద్ర. అతడి కుమార్తెలు, బంధువులు, స్నేహితులు ఎవరు చెప్పినా తన పంతాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం ఈ విషయం చుట్టుపక్క ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. రామచంద్ర కోపం తగ్గి.. అన్నం ఎప్పుడు తింటాడని అందరూ ఎదురుచూస్తున్నారు!

రామచంద్ర, అతని భార్య సీత
Last Updated : Dec 10, 2022, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details