ETV Bharat / bharat

రాజ్యసభ ముందుకు​ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు.. విపక్షాల నిరసనల మధ్యే..

author img

By

Published : Dec 9, 2022, 4:06 PM IST

Updated : Dec 9, 2022, 4:41 PM IST

ఎగువసభలో భాజపా సభ్యుడు కిరోడి లాల్.. ఉమ్మడి పౌర స్మృతి 2020 బిల్లును ప్రైవేటుగా ప్రవేశపెట్టారు. బిల్లును అనుమతించాలా లేదా అనే విషయంపై ఓటింగ్​లో 63 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా.. 23 మంది వ్యతిరేకించారు.

Private members The Uniform Civil Code in India Bill 2020 introduced in Rajya Sabha
Private members The Uniform Civil Code in India Bill 2020 introduced in Rajya Sabha

Uniform Civil Code Bill 2020 Rajya Sabha : భాజపా కీలక అజెండాల్లో ఒకటైన ఉమ్మడి పౌర స్మృతి అంశం.. ప్రైవేటు మెంబర్ బిల్లు రూపంలో పార్లమెంటు ముందుకు వచ్చింది. రాజ్యసభలో భాజపా సభ్యుడు కిరోడి లాల్ మీనా​ శుక్రవారం.. ప్రైవేటుగా​ ఉమ్మడి పౌర స్మృతి 2020​ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే.. ఈ బిల్లును సభ ముందుకు తీసుకురావడాన్ని కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం, టీఎంసీ​ పార్టీలకు చెందిన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ బిల్లు నాశనం చేస్తుందని విమర్శించారు.

బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్​ చేశారు. ఆ సమయంలో ఛైర్మన్​ జగదీప్​ ధన్​ఖడ్.. బిల్లుపై​ ఓటింగ్ నిర్వహించారు. 63 మంది అనుకూలంగా ఓటు వేయగా.. మరో 23 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఫలితంగా ఉమ్మడి పౌర స్మృతి బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది.

ఇదీ చదవండి: 'ఆ కొలీజియం సమావేశ వివరాలు ఇవ్వలేం'.. RTI పిటిషన్​ను కొట్టేసిన సుప్రీం

Last Updated : Dec 9, 2022, 4:41 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.