తెలంగాణ

telangana

భార్య కోసం.. జైలులో 50 రోజులుగా నిరాహార దీక్ష

By

Published : Jun 11, 2022, 4:58 PM IST

తన భార్యను ప్రతివారం కలిసేందుకు అనుమతి ఇవ్వాలని 50రోజులుగా తిహాడ్​ జైలులో నిరాహార దీక్ష చేస్తున్నాడు సుకేశ్ చంద్రశేఖర్​. రూ.200కోట్ల మోసం కేసులో అరెస్టైన అతడు.. నాలుగు నెలలుగా ఈ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.

sukesh chandrshekhar
భార్య కావాలని జైలులో 50 రోజులుగా నిరశన దీక్ష

Sukesh chandrshekhar: రూ.200 కోట్లు మోసానికి పాల్పడి అరెస్టై తిహాడ్​ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్.. తన భార్య కావాలని డిమాండ్ చేస్తూ 50 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. రెండు వారాలకు ఒకట్రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటున్నాడు. దీంతో అనారోగ్యానికి గురైన అతడ్ని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అతని డిమాండ్​ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చంద్రశేఖర్ చికిత్స పొందుతున్నాడు.

సుకేశ్ చంద్ర శేఖర్​.. ఫోర్టిస్ ప్రమోటర్స్​ శివేంద్ర సింగ్ సతీమణి అదితి సింగ్​ను రూ.200 కోట్ల మేర మోసం చేశాడు. ఈ వ్యవహారంలో సుకేశ్​ 4 నెలల కిందే అరెస్టయ్యాడు. అప్పటి నుంచి తీహాడ్​ జైలులోనే ఉంటున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితమే అతడ్ని జైలు నంబర్ 1 నుంచి జైలు నంబర్​ 3కు మార్చారు. సుకేశ్​కు సహకారం అందించినందుకు అతని భార్య లీనా పాల్​ను కూడా పోలీసులు అరెస్టు చేసి తిహాడ్​ జైలులోనే జైలు నంబర్ 6లో ఉంచారు. ఇద్దరినీ రెండు వారాలకు ఒక సారి కలిసేందుకు అనుమతిస్తున్నారు. అయితే తన భార్యను ప్రతివారం కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సుకేశ్ ఏప్రిల్ 23నుంచి నిరశన దీక్ష చేస్తున్నట్లు జైలు అధికారులు చెప్పారు. అతను రెండు వారాలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జైలు నిబంధనల ప్రకారం అతని డిమాండ్​ను నెరవేర్చలేమని, అందుకే కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వివరించారు.

ఇదీ చదవండి:లూడో ఆడుతున్నాడని చితకబాదిన తండ్రి.. బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details