ETV Bharat / bharat

లూడో ఆడుతున్నాడని చితకబాదిన తండ్రి.. బాలుడు మృతి

author img

By

Published : Jun 11, 2022, 3:50 PM IST

లూడో ఆడుతున్నాడనే కోపంతో ఓ బాలుడుని చితకబాది చీకటి గదిలో వేశాడు తండ్రి. తీవ్ర గాయాలైన ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని నది ఒడ్డున పూడ్చిపెట్టాడు తండ్రి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆజమ్​గఢ్​ జిల్లాలో జరిగింది.

child died after beating father
లూడో ఆడుతున్నాడని చితకబాదిన తండ్రి

లూడో గేమ్​ ఆడుతున్నాడనే కోపంతో ఓ బాలుడిని చితకబాదాడు తండ్రి. దాంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుట్టుచప్పుడు కాకుండా తన సోదరుడు, మరో వ్యక్తితో కలిసి నది ఒడ్డున పూడ్చిపెట్టాడు తండ్రి. ఎవరికైనా చెబితే చంపేస్తానని భార్యను బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​, ఆజమ్​గఢ్​ జిల్లాలోని రౌనాపార్​ పోలీస్​ స్టేషన్​ పరిధి, మహులా బాగీచా గ్రామంలో వెలుగు చూసింది.

ఇదీ జరిగింది: మహులా బాగీచా గ్రామానికి చెందిన బాలుడు లక్కీ(8) గత శనివారం ఇంటి సమీపంలో మేకలు కాస్తూ.. తన మొబైల్​లో లూడో ఆడుకుంటున్నాడు. లూడో ఆడటాన్ని గమనించిన అతడి తండ్రి జితేంద్ర.. ఆగ్రహంతో తీవ్రంగా చితకబాదాడు. ఇంటికి తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేశాడు. అతడికి తీవ్ర గాయాలు కావడం వల్ల 9.30 గంటల ప్రాంతంలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతుదేహాన్ని ఖననం చేయాలని నిర్ణయించుకున్నాడు జితేంద్ర. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తన భార్య బబితాను బెదిరించాడు. ఆ తర్వాత తన సోదరుడు ఉపేంద్ర, మరో వ్యక్తి రామ్​జనమ్ సాయంతో ఓ వస్త్రంలో చుట్టి.. మహులా దేవర్​ గ్రామంలోని ఘాఘరా నది ఒడ్డున పూడ్చి పెట్టారు.

మావూ జిల్లాలోని గౌరీడీహ్​ గ్రామంలో ఉండే బాలుడి అమ్మమ్మకు గత మంగళవారం విషయం తెలిసింది. గ్రామానికి చెందిన పవన్​ రాయ్​తో తన కుమార్తె ఇంటికి వెళ్లింది నానీ మున్రా దేవీ. బాలుడి గురించి అడిగినా ఎవరూ చెప్పకపోవటంతో పోలీసులకు సమాచారం అందించింది. జింతేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే చంపేశానని అంగీకరించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్​ చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు ఎస్​ఓ అఖిలేశ్​ చంద్రా తెలిపారు.

ఇదీ చూడండి: అన్న మర్డర్​కు ముగ్గురు ప్లాన్​.. తర్వాత రోజే చెల్లెలు సూసైడ్​.. ఏం జరిగింది?

మ్యాచ్​ మధ్యలో అలా కెమెరాలకు చిక్కిన యువతి.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.