తెలంగాణ

telangana

హిమాచల్ ప్రదేశ్‌లో క్యాబినెట్​ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణం చేసిన ఏడుగురు ఎమ్మెల్యేలు

By

Published : Jan 8, 2023, 10:47 AM IST

Updated : Jan 8, 2023, 11:35 AM IST

హిమాచల్​ ప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం క్యాబినెట్​ను విస్తరించింది. ఆదివారం ఉదయం రాజ్​భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది. ఏడుగురు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్​ రాజేంద్ర అర్లేకర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

Etv himachal-pradesh-cabinet-expanded-members-take-oath-as-ministers
హిమాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వంలో కాబినేట్ విస్తరణ

ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాన్ని విస్తరించింది. మెుత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు లు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. శిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుఖు, డిప్యూటీ సీఎం ముఖేశ్‌ అగ్నిహోత్రి సమక్షంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో హిమాచల్ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఉన్నారు.

గవర్నర్​తో నూతన మంత్రులు

కొత్తగా చేరిన మంత్రుల్లో ధని రామ్ షాండిల్, చందర్ కుమార్, హర్షవర్ధన్ చౌహాన్, జగత్ సింగ్ నేగి ఉన్నారు. రోహిత్ ఠాకూర్, అనిరుధ్ సింగ్, విక్రమాదిత్య సింగ్‌లు సైతం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. కాగా డిప్యూటీ స్పీకర్​ను ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 12 మందికి క్యాబినెట్ మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా సుఖు, ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్​ అగ్రిహోత్రి డిసెంబర్​ 11న బాధ్యతలు స్వీకరించారు. మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. తమ మొదటి క్యాబినెట్​ సమావేశంలో పాత పెన్షన్ అమలు దిశగా నిర్ణయం తీసుకుంటామని సుఖు తెలిపారు.

వీరభద్రసింగ్‌ కుమారుడు విక్రమాదిత్య సింగ్
వీరభద్రసింగ్‌ కుమారుడు విక్రమాదిత్య సింగ్

నవంబరు 12న జరిగిన హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో40 సీట్లను కైవసం చేసుకుంది. భాజపా 25 సీట్లకే పరిమితమయింది. ఇతరులు మూడు చోట్ల గెలిచారు. 35 ఏళ్ల హిమాచల్ ఎన్నికల చరిత్ర చూస్తే... ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలవలేదు. ఒకసారి భాజపా గెలిస్తే.. ఒకసారి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. అధికార పార్టీ భాజపాకు షాకిచ్చిన ప్రజలు.. కాంగ్రెస్‌కు పట్టం గట్టారు.

Last Updated : Jan 8, 2023, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details