తెలంగాణ

telangana

మద్యం మత్తులో స్నేహితుల అరాచకం, మలద్వారంలో గ్లాసు చొప్పించి

By

Published : Aug 22, 2022, 4:15 PM IST

స్నేహితులతో సరదాగా మందు తాగుదామని కూర్చున్నాడు ఓ వ్యక్తి. అందరూ కలిసి మద్యం సేవించారు. అయితే, మద్యం మత్తులో స్నేహితులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. స్నేహితుడి మలద్వారంలోకి స్టీల్ గ్లాసు చొప్పించారు.

Friends Insert Glass Inside Friend Rectum
Drunk Friends Insert Glass Inside Friend's Rectum

Friends Insert Glass Inside Rectum: మద్యం మత్తులో స్నేహితుడి మలద్వారంలో స్టీల్ గ్లాసు చొప్పించారు కొందరు మిత్రులు. అప్పటివరకు సరదాగా గడిపి.. ఉన్నట్టుండి ఈ అరాచకానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల వరకు దీని గురించి బాధితుడు ఎవరికీ చెప్పలేదు. అయితే, నొప్పి తీవ్రం కావడం వల్ల ఆస్పత్రికి వెళ్లాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా బెరంపుర్​లో జరిగింది.

ఎక్స్​రే లో కనిపిస్తున్న గ్లాసు

అసలేం జరిగిందంటే..
బుగుడా బ్లాక్ పరిధిలోని బలిపాదర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి.. గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడ పని చేస్తున్నాడు. దాదాపు 10 రోజుల క్రితం అతను తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. వారు మద్యం మత్తులో అతడి మలద్వారంలో స్టీల్ గ్లాస్‌ను చొప్పించారు.

తర్వాత రోజు నుంచి అతడికి నొప్పి మొదలైంది. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నొప్పి తీవ్రం కావడం వల్ల సూరత్​ నుంచి అతడి సొంతూరికి వచ్చాడు. అనంతరం అతడి పొట్టభాగం ఉబ్బడం మొదలైంది. నొప్పి భరించలేని స్థితికి చేరింది. దీంతో ఎంకేసీజీ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లకు జరిగిన విషయం చెప్పాడు.

అనంతరం వైద్యులు ఎక్స్​ రే తీసి పేగులో గ్లాసు ఉందని నిర్ధరించారు. ఆ గ్లాసును ఆపరేషన్ లేకుండానే బయటకు తీయడానికి ఎంతగానో ప్రయత్నించారు. వారివల్ల కాలేదు. అనంతరం సర్జరీ చేసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. తర్వాత డాక్టర్లు సర్జరీ పూర్తిచేశారు. పేగును కోసి గ్లాసును బయటకు తీశారు. బాధితుడు ఇప్పుడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

చికిత్స పొందుతున్న బాధితుడు

ఇవీ చూడండి: రాంగ్ రూట్​లో వచ్చి స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టిన లారీ, నలుగురు విద్యార్థులు మృతి

నీట మునిగి ఒకే కుటుంబంలో నలుగురు మృతి, ఆడుకోవడానికి వెళ్లి మరో ఏడుగురు పిల్లలు బలి

ABOUT THE AUTHOR

...view details