తెలంగాణ

telangana

భక్తులకు అప్పుడే అయోధ్య రాముడి దర్శన భాగ్యం..!

By

Published : Sep 10, 2021, 8:43 AM IST

అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణ పనులు అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్​ వర్గాలు(Ayodhya Temple Trust) తెలిపాయి. 2023 నాటికి భక్తులు దర్శించుకునేందుకు అనుమతి కల్పిస్తామని చెప్పాయి.

ayodhya ram temple
అయోధ్య రామ మందిరం

అయోధ్యలో రామ మందిర(Ayodhya Ram Mandir) నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్ వర్గాలు(Ayodhya Temple Trust) పేర్కొన్నాయి. 2023నాటికి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపాయి. రామమందిర నిర్మాణ పనులపై ఆగస్టు 27 - 29 మధ్య సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు ట్రస్ట్​ సభ్యులు.

"ఆలయ ప్రాంగణం బయట చేపట్టే నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. డిజైన్లు, డ్రాయింగ్​ పనులు పూర్తి అయ్యాయి. మండపాలు, మ్యాజియం, ఆర్కైవ్స్​, ఆడిటోరియం, గోశాల, యోగశాలలను నిర్మిస్తున్నాం. ఇందుకోసం 3 లక్షల చదరపు అడుగుల కాంక్రీటును వినియోగిస్తున్నాం. వారసత్వ కట్టడాల పరిరక్షణ, అభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్​ను తయారు చేశాం"

-అయోధ్య ఆలయ ట్రస్ట్​ వర్గాలు

అయోధ్య మందిరాన్ని ఉద్గార రహితంగా నిర్మిస్తున్నారు. సాధువులు, పండితుల సూచనల ప్రకారం మాస్టర్​ ప్లాన్​ను అధికారులు సిద్ధం చేశారు. ఆలయ నిర్మాణం కోసం దాదాపు 4 లక్షల చదరపు అడుగుల రాతిని వినియోగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎలాంటి ఉక్కు లేకుండా నిర్మిస్తున్నట్లు చెప్పాయి. ఆలయం కోసం జోధ్​ఫుర్​ నుంచి తీసుకువచ్చిన రాతిని వినియోగిస్తున్నామని ట్రస్ట్​ పేర్కొంది.

ఇదీ చూడండి:'రాముడి పేరున అక్రమాలు సరికాదు'

ఇదీ చూడండి:'అయోధ్య గుడి నిర్మాణాన్ని కళ్లారా చూడొచ్చు!'

ABOUT THE AUTHOR

...view details